తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాప్ 10 రిచ్చెస్ట్ స్పోర్ట్స్ లీగ్స్ - IPL స్థానం ఎంతో తెలుసా? - Richest Sports Leagues - RICHEST SPORTS LEAGUES

Richest Sports Leagues : క్రీడా ప్రపంచంలో కొన్ని స్పోర్ట్స్‌ లీగ్‌లు అత్యధిక ఆదాయం అందుకుంటున్నాయి. టాప్‌ టెన్‌ లీగ్‌లలో ఏవున్నాయి? ఇందులో ఐపీఎల్ స్థానం ఎంతో తెలుసా?

Richest Sports Leagues
Richest Sports Leagues (Source : Getty Images, Associated Press (Middle))

By ETV Bharat Sports Team

Published : Sep 28, 2024, 4:34 PM IST

Richest Sports Leagues :ప్రజలకు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే రంగాల్లో క్రీడలు ముందుంటాయి. స్పోర్ట్స్​ను అనుసరించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రతి ఏటా క్రీడా రంగానికి ఆదరణ, ఆదాయం పెరుగుతున్నాయి. గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్ 2021లో 486.61 బిలియన్ డాలర్ల నుంచి 2023లో 512.14 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2026 నాటికి 700 బిలియన్ డాలర్సకు చేరవచ్చని అంచనా.

ప్రజలకు మరింత మజా అందించేలా ఆయా క్రీడల్లో తీసుకొచ్చిన మార్పులు విజయవంతం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని స్పోర్ట్స్‌ లీగ్‌లు భారీ లాభాలు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రిచెస్ట్ స్పోర్ట్స్‌ లీగ్‌లు ఏవి? అందులో ఇండియా మోస్ట్ పాపులర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్థానం ఎంత?తెలుసుకుందాం.

  1. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL): 2023లో అమెరికన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ ఎన్‌ఎఫ్‌ఎల్‌ 13 బిలియన్ డాలర్ల ఆదాయంతో రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ లీగ్‌లో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ లీగ్‌ 1920లో మొదలైంది, ఇప్పుడు 32 జట్లు తలపడుతున్నాయి. NFL 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
  2. మేజర్ లీగ్ బేస్‌బాల్ (MLB) : మేజర్‌ బేస్‌బాల్‌ లీగ్‌ని 1876లో ప్రారంభించారు. 2023లో 11.34 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఈ లిస్ట్​లో రెండో స్థానంలో నిలిచింది. ప్రతి సీజన్‌లో 30 జట్లు పాల్గొంటాయి. ఈ మేజర్ బేస్​బాల్ టోర్నీలో 162 గేమ్‌లు జరుగుతాయి.
  3. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA) : 2022- 23 సీజన్‌లో నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ 10.58 బిలియన్ డాలర్ల ఆదాయంతో మూడో స్థానం సొంతం చేసుకుంది. NBA లీగ్‌ 1946లో మొదలైంది.
  4. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) : 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తక్కువ టైమ్​లోనే రిచెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు పొందింది. 2023 సీజన్‌లో 9.5 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. టాప్‌ టెన్‌ స్పోర్ట్స్‌ లీగ్‌లలో నాలుగో స్థానం దక్కించుకుంది.
  5. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL) : ఫుట్‌బాల్‌ లీగ్‌ ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (EPL) కూడా చాలా పాపులర్‌ అయ్యింది. 1992లో మొదలైన ఈ EPL 2022- 23 సీజన్‌లో ఏకంగా £7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది.
  6. నేషనల్ హాకీ లీగ్ (NHL) : ఐస్‌ హాకీ లీగ్‌ అయిన నేషనల్ హాకీ లీగ్ (NHL) 1917 నుంచి నిర్వహిస్తున్నారు. గతేడాది NHL 6.43 బిలియన్ డాలర్ల లాభాలు పొందింది. రిచెస్ట్ స్పోర్ట్స్‌ లీగ్‌లలో ఆరో స్థానం పొందింది.
  7. లా లిగా శాంటాండర్ (LaLiga) : స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్ లా లిగా (LaLiga) ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది. 1929 నుంచి లా లిగా టోర్నీల జరుగుతోంది. గతేడాది ఏకంగా 5.69 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది.
  8. బుండెస్లిగా (Bundesliga) : జర్మనీకి చెందిన ఫుట్‌బాల్‌ లీగ్ బుండెస్లిగా (Bundesliga ) 2022- 23 సీజన్‌లో ఏకంగా €4.4 బిలియన్ డాలర్లు సంపాదించింది. రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ప్రధాన ఫుట్‌బాల్‌ టోర్నీ 1962 నుంచి జరుగుతోంది.
  9. UEFA ఛాంపియన్స్ లీగ్ : UEFA ఛాంపియన్స్ లీగ్ అనేది అత్యంత సంపన్నమైన ఖండాంతర ఫుట్‌బాల్ పోటీ. 2022-23 సీజన్‌లో €3.2 బిలియన్ డాలర్ల లాభం అందుకుంది. 1955లో UEFA ఛాంపియన్స్ లీగ్ ప్రారంభమైంది.
  10. సీరీ ఎ (Serie A) : ఇటలీ ఫుట్‌బాల్‌ లీగ్‌ సీరీ A 2022-23లో €2.9 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇది రిచెస్ట్‌ గ్లోబల్ స్పోర్ట్స్ లీగ్‌లలో పదో స్థానంలో ఉంది. ఈ లీగ 1898 నుంచి జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details