ETV Bharat / sports

ఇట్స్ అఫీషియల్​- ఛాంపియన్స్​ ట్రోఫీకి స్టార్ పేసర్ దూరం- ఇక కష్టమే! - CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్​ ట్రోఫీకి స్టార్ ప్లేయర్ దూరం- అప్పుడే గాయాలు షురూ!

Champions Trophy 2025
Champions Trophy 2025 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 15, 2025, 9:55 PM IST

Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే సౌతాఫ్రికాకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రీచ్ నోకియా టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు ఐసీసీ బుధవారం అధికారికంగా పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ లక్ష్యంగా సౌతాఫ్రికా బోర్డు రీసెంట్​గా 15 మందితో కూడిన జట్టును రీసెంట్​గా ప్రకటించింది. ఆ జట్టులో నోకియా స్థానం దక్కింది. కానీ, అతడు వెన్నునొప్పి గాయంతో దూరమయ్యాడు.

ప్రస్తుతం వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న నోకియాకు గత సోమవారం స్కానింగ్ చేశారు. ఈ రిపోర్ట్​లో అతడి గాయం తాజా పరిస్థితి వెల్లడైంది. అయితే ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు అతడు పూర్తిగా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అతడు దూరం కానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇక నొకియా రిప్లేస్​మెంట్​ను సౌతాఫ్రికా త్వరలోనే వెల్లడించనుంది.

కాగా, నోకియా 2023 వన్డే వరల్డ్​కప్​ టోర్నీకి కూడా మిస్ అయ్యాడు. అప్పుడు కూడా గాయంతో ఉన్న నోకియా మెగాటోర్నీలో పాల్గొనలేదు. అయినప్పటికీ సఫారీ జట్టు సెమీస్ ​దాకా వచ్చింది. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచకప్​లో నోకియా అదరగొట్టాడు. 15 వికెట్లతో సత్తా చాటాడు.

అయితే 2023 వన్డే, 2024 టీ20 వరల్డ్​కప్ టైటిళ్లను తృటిలో చేజార్చుకున్న సౌతాఫ్రికా ఈసారి ఛాంపియన్స్​ ట్రోఫీ ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే స్టార్ ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో 10మంది 2023 వన్డే వరల్డ్​కప్​లో ఆడిన ఆటగాళ్లే కావడం గమనార్హం. కాగా, వన్డే వరల్డ్​కప్​లో సెమీస్​లో ఓడిన సఫారీ జట్టు, టీ20 ప్రపంచకప్​లో టైటిల్​కు అడుగు దూరంలో నిలిచిపోయింది.

సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మర్​క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్​ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్

ఫ్యాన్స్​కు షాక్- బుమ్రాకు బెడ్ రెస్ట్​-ఛాంపియన్స్​ ట్రోఫీకి డౌటే!

ఇంగ్లండ్ సిరీస్​తో జట్టులోకి షమీ రీఎంట్రీ! - ఆ రోజే ఫైనల్ డెసిషన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.