Jasprit Bumrah Back Injury : ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా ఓటమిని చవి చూసింది. అయితే ఆ టెస్ట్ చివరి మ్యాచ్‌లో రాణిస్తాడనుకున్న జస్ప్రీప్ బుమ్రా అనూహ్యంగా మైదానం వీడి అందరినీ షాక్‌కు గురి చేశాడు. వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడ్డ అతడు, అక్కడి వైద్య సిబ్బందితో స్కానింగ్‌కు వెళ్లాడు. కానీ ఆ పరీక్షల్లో అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలియడం వల్ల రెండో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఆటలోకి రాలేదు.
దీంతో రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కానున్నాడంటూ పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. వెన్ను గాయంతో బాధపడుతున్నందున బుమ్రాను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారని, అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు వచ్చేది అనుమానమే అంటూ ఆ వార్తల సారాంశం. కానీ తాజాగా ఈ రూమర్స్‌పై బుమ్రా స్వయంగా స్పందించాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవాలు లేవంటూ కొట్టిపారేశాడు. ఫేక్ న్యూస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుందని కౌంటర్ ఇచ్చాడు.
"ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం చాలా సులువు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అయితే ఈ న్యూస్ నాకు నవ్వు తెప్పించింది.ఆ రిపోర్ట్స్ అన్నీ ఫేకే" అంటూ నవ్వు ఎమోజీలను ఆ పోస్ట్‌కు జత చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఊరట చెందారు. అయినప్పటికీ 'గెట్ వెల్ సూన్ బుమ్రా', 'కమ్ బ్యాక్ సూన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
I know fake news is easy to spread but this made me laugh 😂. Sources unreliable 😂 https://t.co/nEizLdES2h
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 15, 2025
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే టీమ్ఇండియా ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. అయితే దాని కోసం ఇదివరకే జట్టును ప్రకటించారు. కానీ ఈ సిరీస్ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు సంబంధించిన తుది జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి, ఈ సిరీస్‌కు ఒకేసారి జట్టును ప్రకటిస్తారని అది కూడా మరో 3, 4 రోజుల్లోనే ఉండనుందని సమాచారం.
ICC 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా బుమ్రా- ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌ను వెనక్కి నెట్టిన స్టార్ పేసర్
'అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్'- నాకు తెలిసిన ఫాస్ట్ బౌలర్ అతడే' ఆసీస్ మాజీ కెప్టెన్ ప్రశంసలు