ETV Bharat / state

'హౌసింగ్‌ బోర్డు' ఫర్​ సేల్ - ఆ 2 రోజుల్లో వేలం - త్వరపడండి - GOVT PLANS AUCTION UNFINISHED PLOTS

గ్రేటర్ పరిధిలో మిగిలిపోయిన హౌసింగ్​ బోర్డ్ స్థలాల వేలం - రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా

Telangana Govt Planning to Auction Housing Board Areas
Telangana Govt Planning to Auction Housing Board Areas (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 10:45 AM IST

Telangana Govt Planning to Auction Housing Board Areas : గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కొన్నేళ్లుగా అక్కడక్కడా మిగిలిపోయిన హౌసింగ్​ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లను విక్రయానికి పెట్టారు. అన్ని స్థలాలు కలిపి 4,880.98 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. అతి తక్కువగా 6.11 చదరపు గజాలు, అత్యధికం 290 చదరపు గజాలు ఉన్నాయి. ఇవి కూకట్​పల్లి హౌసింగ్​ బోర్డు పరిధిలోనే నాలుగు ఫేజుల్లో ఉన్నాయి.

మిగిలిన స్థలాలు అప్పుడే వేలంలోకి : గతంలో వేలం వేసిన సందర్భంగా చిన్న చిన్న ప్లాట్లు మిగిలిపోగా, వాటితో పాటు గతంలో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాని వాటిని గుర్తించి విక్రయానికి పెట్టారు. వాటి విక్రయం ద్వారా రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో రెండు దఫాలుగా జనవరి 31, వచ్చే నెల అయిదో తేదీన మిగిలిన 42 స్థలాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.

త్వరలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలం - కొనుగోలు చేసేందుకు వారికే అవకాశం!

రెండు వేలకు పైగా స్థలాలు వేలం పరిధిలోకి : ఈ ఏడాది మార్చిలో మరోసారి పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్లాట్లు, ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం స్వల్ప విస్తీర్ణంతో పాటు కొన్నేళ్లు ఖాళీగా ఉన్న వాటిని విక్రయించడం ద్వారా ఆయా ఫేజుల్లో వేలం ప్రక్రియ పూర్తి చేసినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మార్చిలో సుమారు రెండు వేలకు పైగా స్థలాలు వేలం పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

గ్రేటర్ పరిధిలో హౌసింగ్​ బోర్డు విక్రయానికి పెట్టిన కొన్నిప్లాట్ల వివరాలు
ప్రాంతంప్లాట్ల సంఖ్యవిస్తీర్ణం చదరపు గజాలువేలం తేదీ
కేపీహెచ్​బీ 5,8,9,15 ఫేజుల్లో543,040.16జనవరి 24
గచ్చిబౌలి, బాలాజీనగర్​, భరత్​నగర్​07566.09జనవరి 30
మహేశ్వరం మండల్​ రావిర్యాల421,274.71ఫిబ్రవరి 5

ఇళ్లు, భూములు కొనేవాళ్లకు గుడ్​న్యూస్ - రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, భూముల వేలం ఎప్పటినుంచో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.