Harbhajan Slams BCCI : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ఈ క్రమంలో రంజీల్లో రాణిస్తున్న ఓ ప్లేయర్‌కు మద్దతుగా మాట్లాడారు. తనను త్వరలో జరగబోయే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని హర్భజన్ డిమాండ్ చేశాడు.
ఇంతకీ ఎవరా ప్లేయర్?
ఒకప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్‌పై ఏకంగా ట్రిపుల్ సెంచరీ (303) బాది క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు కరుణ నాయర్. అయితే ఆ ఘనత తర్వాత నెమ్మదిగా ఫేడ్ ఔట్ అయిపోయాడు. దాదాపు 8 ఏళ్ల నుంచి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనూ కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఇప్పుడు బ్యాట్ చేతపట్టి రంజీల్లో రాణిస్తున్నాడు. ఈ ఏడాది టోర్నీలో ఐదు శతకాలు రాణించిన కరుణ, టోర్నీ మొత్తంలో ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు స్కోర్ చేశాడు.
"నేను తన గణాంకాలను చూశాను. 2024-25లో అతడు ఆరు ఇన్నింగ్స్ ఆడాడు. వాటిలో ఐదింటిలో తను నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 664 పరుగులు స్కోర్ చేశాడు. అందులోనూ 120 స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. అయినప్పటికీ తనను జట్టులోకి తీసుకోలేదు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ప్లేయర్స్ అద్భుతంగా రాణిస్తుంటే వారిని ప్రోత్సాహించాలి. మ్యాచుల్లో ఆడించాలి. అదే కరెక్ట్ కదా? అతడికి టాటూలు లేవు. ఫ్యాన్సీ డ్రెస్‌లు వేసుకోడు. ఒకవేళ అతడిని తీసుకోకపోవడానికి అదే కారణమా? అతడేమి కష్టపడేవాడు కాదా. తనకు మాత్రం రూల్స్ ఎందుకు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎంతో మంది జాతీయ జట్టుకు తమ పెర్ఫామెన్స్ ఆధారంగానే ఎంపిక అవుతారు.అయితే ఎందుకు అతడికి మాత్రం ఈ రూల్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి? రోహిత్, విరాట్ ఫామ్‌లో లేరని క్రీడాభిమానులు అంటున్నారు. అందుకే మీరు వాళ్లను రంజీకి పంపిస్తున్నారు. అయితే మళ్లీ రంజీలో అద్భుతంగా ఆడి పరుగులు చేస్తున్నవారిని మాత్రం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు. మరి వాళ్లు ఎప్పుడు ఆడతారు. వాళ్లూ దేశవాళీలో పరుగులు చేస్తున్నారు కదా?" అని హర్భజన్ బీసీసీఐపై మండిపడ్డాడు.
BCCI నయా రూల్స్- గంభీర్ గొంతెమ్మ కోరికలు కట్! ప్లేయర్లకూ ఆ ఛాన్స్ లేనట్టే!
2024లో భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం - ఐపీఎల్ వ్యూవర్‌షిప్‌తో రూ.4200 కోట్ల లాభం!