Bumrah Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. ఇప్పటికే ఆయా టీమ్‌లు ఛాంపియన్స్ ట్రోఫీ జట్లను ప్రకటించాయి. భారత్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కొంత మంది ఆటగాళ్ల ఫిట్‌నెస్ అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది.
ఈ క్రమంలో కొన్ని వార్తలు భారత అభిమానులను షాక్‌కి గురి చేశాయి. అద్భుత ఫామ్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం సందేహంగా ఉంది. బుమ్రాకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా సంచలన ప్రదర్శన చేశాడు. 32 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు. చివరి టెస్టు జరుగుతున్నప్పుడు బుమ్రా గాయపడ్డాడు. చివరిలో బౌలింగ్ చేయలేకపోయాడు.
'బుమ్రాకి బెడ్ రెమరింత స్ట్ అవసరం. బుమ్రా బెంగుళూరులోని బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అతడు ఎప్పుడు చేరుతాడనేది కూడా ఇంకా కన్ఫార్మ్ కాలేదు. బుమ్రా వచ్చే వారం CoEకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కండరాలు కోలుకోవడానికి, వాపు తగ్గడానికి సమయం పడుతుంది. ఆ తర్వాతే బుమ్రా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది'
'బుమ్రా గాయం అతడిని ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం ఆటకు దూరంగా ఉంచవచ్చు. మొదట్లో బుమ్రా గాయాన్ని వాపుగా భావించారు, అయితే ఇది డిస్క్ ఉబ్బడం లేదా హైయర్-గ్రేడ్ కండరాల వాపు వంటి తీవ్రమైన సమస్య కావచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. మరింత గాయం కాకుండా పూర్తిగా కోలుకునేలా బుమ్రా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది'అని నివేదికలు పేర్కొన్నాయి.
భారత మాజీ స్ట్రెంథ్ అండ్ కండిషనింగ్ కోచ్ రామ్‌జీ శ్రీనివాసన్ బుమ్రా గాయంపై మాట్లాడారు. 'చీలిక ఉన్నప్పుడు వాపు తరచుగా సంభవిస్తుంది, ఇది ఫ్లూయిడ్ ఏర్పడటానికి (ఎడెమా) దారితీస్తుంది. రికవరీ చీలిక తీవ్రత (గ్రేడ్), హీలింగ్ కెపాసిటీ, మెడికల్ ట్రీట్‌మెంట్, రీహాబిలిటేషన్‌పై ఆధారపడి ఉంటుంది' అని తెలిపారు.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా అందుబాటులో ఉండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ వేట మొదలవుతుంది.
ICC 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా బుమ్రా- ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌ను వెనక్కి నెట్టిన స్టార్ పేసర్
టీమ్ఇండియా అభిమానులకు షాక్ - ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్‌కు బుమ్రా దూరం!