VVS Laxman South Africa series :మరో పది రోజుల్లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచింగ్ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్ అందుకోనున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ గతంలో కూడా భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే పర్యటనలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ జట్టును కోచ్‌గా నడిపించాడు.
Gambhir Border Gavaskar Trophy : అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనతో రెగ్యులర్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా అవ్వనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ (బోర్డర్ గావస్కర్ ట్రోఫీ )జరగనుంది. ఇందుకోసం రోహిత్ సేన నవంబర్ 10నే బయలుదేరే అవకాశం ఉంది.
మరోవైపు సౌతాఫ్రికాతో సిరీస్ నవంబర్ 8 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. దీని కోసం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన భారత బృందాన్ని అక్టోబర్ 25న ప్రకటించారు. కాబట్టి రెండు సిరీస్‌లు క్లాష్ అవ్వడంతో దక్షిణాప్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించడం గంభీర్‌కు సాధ్యపడదు. అందుకే లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించనుంది.