Under 19 World Cup Best Team : మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. రెండేళ్ల కిందట తొలి ట్రోఫీని దక్కించుకున్న టీమ్‌ఇండియా రెండోసారి కూడా కప్పును నిలబెట్టుకుంది. అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి ఇటు బ్యాటుతో, అటు బంతితో చెలరేగిపోతున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో (44 నాటౌట్; 33 బంతుల్లో 8×4) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది
309 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలవడమే కాక 7 వికెట్లు కూడా తీసిన త్రిషనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా వరించింది. ఈక్రమంలో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. త్రిషతోపాటు జి.కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవిశర్మ ఈ టీమ్‌కు ఎంపికయ్యారు. టోర్నీలో 11 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకే కెప్టెన్‌గా మొత్తం 12 మందితో టీమ్‌ను ప్రకటించింది ఐసీసీ.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ - మహిళల అండర్-19 ప్రపంచకప్ 2024
- గొంగడి త్రిష (భారత్) - పరుగులు: 309, సగటు: 77.25, స్ట్రైక్ రేట్: 147.14, టాప్ స్కోర్: 100 నాటౌట్
- జెమ్మా బోథా (దక్షిణాఫ్రికా) - పరుగులు: 105, సగటు: 26.25, స్ట్రైక్-రేట్: 123.52, టాప్ స్కోర్: 37
- డేవినా పెర్రిన్ (ఇంగ్లాండ్) - పరుగులు: 176, సగటు: 35.20, స్ట్రైక్ రేట్: 135.38, టాప్ స్కోర్: 74
- జి.కమలిని (భారత్) - పరుగులు: 143, సగటు: 35.75, స్ట్రైక్ రేట్: 104.37, టాప్ స్కోర్: 56 నాటౌట్
- కావోయిమ్‌హే బ్రే (ఆస్ట్రేలియా) - పరుగులు: 119, సగటు: 29.75, స్ట్రైక్ రేట్: 96.74, టాప్ స్కోర్: 45
- పూజ మహతో (నేపాల్) - పరుగులు: 70, సగటు: 23.33, స్ట్రైక్ రేట్: 51.85, టాప్ స్కోర్: 70; వికెట్లు: 9 బెస్ట్: 4/9
- కైలా రేనెకే (కెప్టెన్) (దక్షిణాఫ్రికా) - వికెట్లు: 11, ఎకానమీ: 4.14, బెస్ట్: 3/2
- కేటీ జోన్స్ (వికెట్‌కీపర్) (ఇంగ్లండ్) - ఔట్‌లు: 9, (క్యాచ్‌లు: 2, స్టంపౌట్‌లు: 7)
- ఆయుషి శుక్లా (భారత్) - వికెట్లు: 14, సగటు: 5.71, ఎకానమీ: 3.01, బెస్ట్: 4/8
- చమోడి ప్రబోద (శ్రీలంక) - వికెట్లు: 9, సగటు: 6.33, ఎకానమీ: 3.80, బెస్ట్: 3/5
- వైష్ణవి శర్మ (భారత్) - వికెట్లు: 17, సగటు: 4.35, ఎకానమీ: 3.36, బెస్ట్: 5/5
- న్తాబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా) - వికెట్లు: 6, సగటు: 7.33, ఎకానమీ: 4.00, బెస్ట్: 3/4