Virat Kohli RCB :టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గత 17ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వస్తున్నాడు. ఇక రీసెంట్గా 2025 రిటెన్షన్స్‌లోనూ ఆర్సీబీ భారీ ధరకు విరాట్‌ను అట్టిపెట్టుకుంది. అయితే మూడేళ్లకోసారి మెగా వేలం ఉంటుంది, కాబట్టి విరాట్ 2027 వరకు ఆర్సీబీ జట్టులోనే ఉండే ఛాన్స్ ఉంది. ఇటీవల విరాట్ అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో ఐపీఎల్ కెరీర్‌పై ఫ్యాన్స్ ఉత్కంఠగా ఉన్నారు.
ఐపీఎల్ కెరీర్‌పై విరాట్ హింట్- మరో మూడేళ్లు ఆర్సీబీతోనే! - VIRAT KOHLI RCB
ఐపీఎల్ కెరీర్‌పై విరాట్ హింట్- మరో మూడేళ్లు ఆర్సీబీతోనే- నెక్స్ట్ టార్గెట్ అదే!
Published : Nov 3, 2024, 10:18 AM IST
అయితే ఈ ఉత్కంఠకు విరాట్ స్వయంగా తెరదించాడు. తను ఆర్సీబీ తరఫున 20ఏళ్లు ఆడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మరో మూడేళ్లు పొట్టి క్రికెట్ ఆడతానని విరాట్ హింట్ ఇచ్చాడు. 'రానున్న మూడేళ్ల వ్యవధితో ఆర్సీబీ తరపున 20 ఏళ్లు పూర్తి చేసుకుంటా. నాకు అది ఎంతో ప్రత్యేకం. ఒకే జట్టుకు ఇన్నేళ్లపాటు ఆడతానని అనుకోలేదు. ఆ జట్టుతో ఇన్నేళ్లుగా ప్రత్యేక బంధం కొనసాగుతోంది. ఆర్సీబీ కాకుండా ఇతర ఫ్రాంచైజీకి ఆడటాన్ని ఊహించలేను. మళ్లీ ఆ జట్టులోనే కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉన్నా. ఈ సారి వేలంలో పటిష్టమైన జట్టును నిర్మించుకునే ఛాన్స్ వచ్చింది. వచ్చే మూడేళ్లలో ఒక్కసారైనా ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలపాలన్నదే నా లక్ష్యం' అని విరాట్ అన్నాడు. ఈ వీడియోను ఆర్సీబీ తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్స్ 2025
- విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
- రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
- యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)