IND W vs IRE W 3rd ODI 2025 : ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 435 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సారా ఫోర్బ్స్ (41 పరుగులు) టాప్ స్కోరర్. ఓర్లా (36 పరుగులు) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వార్ 2, టిటాస్ సధు, సయాలి, మిన్ను తలో ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ లూయిస్ (1 పరుగులు) వికెట్ కోల్పోయింది. ఇక వన్‌డౌన్‌లో దిగిన రెలీ (0) ఆ తర్వాతి ఓవర్లో పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్ మాత్రం ఉన్నంతసేపు కాస్త నిలకడగా ఆడింది. ఓర్లా (36 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. మరోసారి భారత బౌలర్లు విజృంభించారు. ఓర్లాతోపాటు లారా డెలానీ (10 పరుగులు), లేహ్ పాల్ (15 పరుగులు), కెల్లీ (2 పరుగులు) పెద్దగా ప్రభావం చూపించలేదు.
🚨 𝙍𝙚𝙘𝙤𝙧𝙙 𝘼𝙡𝙚𝙧𝙩 🚨
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
With a 3⃣0⃣4⃣-run victory in the series finale, #TeamIndia registered their Biggest ODI win (by runs) in women's cricket 👏 🔝
Well done! 🙌 🙌
Scorecard ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/3yGIheSB7X
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానకి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (154 పరుగులు; 129 బంతుల్లో; 20x4, 1x6), స్మృతి మంధాన (135 పరుగులు; 80 బంతుల్లో; 12x4, 7x6) సెంచరీల మోత మోగించారు. రితా ఘోష్ (59 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ, ఫ్రెయా, జార్జియానా తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, పరుగులపరంగా భారత్ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్ ఇదే. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో 249 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది.