ETV Bharat / entertainment

సైఫ్ అలీఖాన్​పై ఎటాక్​- ఆరు సార్లు పొడిచి పరారైన దుండగుడు - SAIF ALI KHAN INJURED

ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచిన దొంగ - సైఫ్ అలీఖాన్​కు గాయాలు - ముంబయిలో చికిత్స

Saif Ali Khan Injured
Saif Ali Khan (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2025, 8:24 AM IST

Saif Ali Khan Injured : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్​పై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ముంబయిలోని తన ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని ఆపేందుకు సైఫ్ యత్నించగా, దుండగుడు ఓ పదునైన ఆయుధంతో సైఫ్​ను పలుమార్లు పొడిచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అయితే లీలావతి ఆసుపత్రిలో సైఫ్‌కు తాజాగా శస్త్రచికిత్స చేయగా, ఆయనకు ప్రమాదం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇదీ జరిగింది :
పోలీసులు, సైఫ్​ పీఆర్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం. బాంద్రాలోని తన నివాసంలో సైఫ్‌ అలీఖాన్‌, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్, పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఏదో అలికిడి వినపడింది. దీంతో ఉలిక్కి పడ్డ సైఫ్​ అది ఏంటో తెలుసుకునేందుకు సౌండ్ వచ్చిన వైపుకు​ వెళ్లాడు. ఆ సమయంలోనే ఓ దుండగుడు ఆయన కంట పడ్డాడు. అయితే ఆ అవతలి వ్యక్తి ఎవరా అని చూస్తున్న సమయంలో ఆ దుండగుడు సైఫ్​పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి సైఫ్​కు చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే దుండగుడిని నిలవరిస్తున్న సమయంలో అతడు సైఫ్​ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిగాట్లకు గురైన సైఫ్​ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.

ఆరు చోట్ల గాయాలు
ఇదిలా ఉండగా, తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్‌కు ఒంటిపై ఆరుచోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. నాలుగు చోట్ల కొద్దిగా, అలాగే రెండు చోట్ల లోతుగా గాయమైనట్లుగా లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ముఖ్యంగా వెన్నుముఖకు సమీపంలో గాయాలైనట్లు వివరించారు. అత్యంత పదునైన ఆయుధంతోనే ఈ దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.

ఇది దొంగ పనేనా?
మరోవైపు ఓ గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ అలీఖాన్‌ పీఆర్​ టీమ్ వెల్లడించింది. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీమ్ తెలిపింది. అభిమానులను అలాగే మీడియాను సంయమనం పాటించాలని కోరింది.

ఇక సైఫ్‌ పీఆర్ టీమ్​ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబయి బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్​ఐఆర్ నమోదైంది. దాడి ఘటనను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి పనిమనుషులను విచారించారు. ఇది దొంగపనేనా? అని ప్రశ్నించడంతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సైఫ్ నివాసం సత్‌గురు శరణ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

'ఆ న్యూస్ విని షాకయ్యాను'
మరోవైపు సైఫ్​ అలీఖాన్​పై జరిగిన దాడిపై తన కో స్టార్ జూనియర్ ఎన్​టీఆర్ స్పందించారు. ఈ విషయం తెలుసుకుని షాకయ్యారని, తాను ఎంతో బాధపడ్డారని తెలిపారు. త్వరగా కోలుకోవాలనుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు. "సైఫ్ సర్​పై జరిగిన దాడి గురించి విని షాక్ అయ్యాను. ఎంతో బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను." అని రాసుకొచ్చారు.

గన్​ మిస్​ఫైర్!​- బాలీవుడ్ నటుడు గోవిందాకు గాయం - Actor Govinda hospitalized

టాలీవుడ్​పై 'దేవర' విలన్ సైఫ్​​ కీలక కామెంట్స్ - ఆ విషయంలో కొరటాల బాగా హెల్ప్ చేశారట! - Saif Alikhan Devara Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.