తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్ఇండియా కోచ్ ఎంపికలో ట్విస్ట్- గంభీర్​తోపాటు 'అతడు' కూడా! - Team India New Coach

Team India Coach: టీమ్ఇండియా హెడ్​కోచ్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. గౌతమ్ గంభీర్​తోపాటు మరో మాజీ క్రికెటర్​ కూడా కోచ్​గా ఎంపికయ్యే అవకాశం ఉందట. మరి అతడు ఎవరంటే?

Team India Coach
Team India Coach (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 3:11 PM IST

Team India Coach:టీమ్ఇండియా హెడ్​కోచ్ రేస్ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. జట్టు హెడ్​ కోచ్​గా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఎంపిక లాంఛనమే అని ప్రచారం సాగుతుండగా అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్‌ కూడా కోచ్ రేస్​లో ఉన్నట్లు తెలుస్తోంది. గంభీర్​తోపాటు రామన్ కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకి వెళ్లాడంట. ఇంటర్వ్యూలో గంభీర్, రామన్ ఇద్దరు కూడా తమ ప్రదర్శనలతో బీసీసీఐ అధికారులను ఆకట్టుకున్నారట.

ఇక టీమ్ఇండియా క్రికెట్ అభివృద్ధి కోసం రామన్ ఓ రోడ్​మ్యాప్ సిద్ధం చేసి బీసీసీఐకి సమర్పించాడని టాక్. అయితే గంభీర్​కు ఐపీఎల్​లో ఆయా జట్లకు మెంటార్​గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ జట్టును వరుసగా రెండుసార్లు ప్లేఆఫ్స్ చేర్చగా, తాజాగా 2024 ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ను ఛాంపియన్​గా నిలిపాడు. అటు రామన్ ​కూడా అనుభవజ్ఞుడే. అతడు అండర్-19, భారత మహిళా జట్టు కోచ్​గా పనిచేశాడు. దీంతోపాటు దేశవాళీ క్రికెట్​లో ఆయా జట్లకు నిర్దేశం చేశాడు. ఇక ఐపీఎల్​లోనూ పంజాబ్, కోల్​కతా ఫ్రాంచైజీలకు బ్యాటింగ్ కోచ్​గా పనిచేశాడు. దీంతో ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలోనని బీసీసీఐ కన్ఫ్యూజన్​లో ఉన్నట్లు సమాచారం.

అయితే ఇద్దర్నీ కోచ్​లుగా ఎంపిక చేస్తే ఎలా ఉంటుందోనని కూడా బీసీసీఐ ఆలోచిస్తుందట. గంభీర్​ను టీమ్ఇండియా హెడ్ కోచ్​గా చేసి, రామన్​ను టెస్టు కోచ్​ లేదా బ్యాటింగ్ కోచ్​గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. కాగా, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ నెల ఆఖర్లో ముగియనుంది. జులై 1 నుంచి కొత్త కోచ్‌ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో బీసీసీఐ ఈ నెల చివరి వారంలోగా కొత్త కోచ్​ను ప్రకటించనుంది. ఇక కొత్తగా బాధ్యతలు స్వీకరించే కోచ్ 2027 దాకా కొనసాగుతారు. ఈ పదవీకాలంలో ఐసీసీ ప్రతిష్ఠాత్మకమైన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్, 2027 వన్డే వరల్డ్​కప్​ టోర్నీలు ఉంటాయి.

టీమ్​ఇండియా హెడ్​ కోచ్​ రేసులో కొత్త పేరు - ఇంటర్వ్యూ కూడా చేశారట! - TeamIndia New Head Coach

హెడ్​ కోచ్​గా గంభీర్ ఫిక్స్​? ఆ కండీషన్​కు ఓకే చెప్తేనే! - Team India New Coach

ABOUT THE AUTHOR

...view details