Chinthakunta in YSR Kadapa District : ఆదిమానవుడు మన పూర్వీకుడు. అలాంటి ఆదిమానవుడు నడయాడిన నేల మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. చింతకుంట ప్రాంతంలోని గుహలు దేశంలోనే రెండోస్థానంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింబేట్కాలో అతిపెద్ద గుహల సముదాయం ఉంది. ఆ తర్వాతి స్థానం మన ఆంధ్రప్రదేశ్‌దే. కానీ వైఎస్సార్ కడప జిల్లా వాసులకు కూడా ఆ విషయం తెలియదు. చరిత్రను చదివే విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించేలా వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రాలు ఈ రాళ్లపై చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి.
ఈ గుహల్లో విలువైన ఖనిజాలు ఉండడంతో గుహలను గుర్తిస్తే తమ తవ్వకాలకు ఇబ్బంది కలుగుతుందని కొందరు వీటిని వెలుగు చూడకుండా ముసుగులు కప్పేస్తున్నారు. "గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా" గా గుర్తింపు పొందిన గండికోట అభివృద్ధికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. సమీపంలోనే ఉన్న ఈ చింతకుంట గుహలను కూడా అభివృద్ధి దిశగా ఆలోచిస్తే పర్యాటకం మరింతగా విస్తరిస్తుందన్న సూచనలు మొదలయ్యాయి.
వైఎస్సార్ కడప జిల్లా చింతకుంట గ్రామంలోని ఎర్రమల కొండల్లో ఉన్న శిలలపై రేఖా చిత్రాలు దాదాపు వేయ్యేళ్ల క్రితం నాటివి. నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇవి ప్రత్యేక ప్రసిద్ధి పొందాయి. కొండల్లో పెద్ద పెద్ద బండ రాళ్లపై ఆది మానవుడు గీసిన రేఖా చిత్రాలుగా ప్రముఖ చరిత్రకారులు, పురావస్తు శాఖ నిపుణులు స్పష్టం చేశారు.
- ఆస్ట్రియా దేశానికి చెందిన ఆర్కియాలజీ శాఖకు చెందిన నిపుణుడు ఇర్విన్ న్యూ మేయర్ మొదటిసారి వీటిని గుర్తించి ది "ప్రి హిస్టారిక్ రాక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా" అనే పుస్తకంలో 1993 వ ఏటా ప్రచురించారు. అందులో చింతకుంట గుహలను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద ఆది మానవుడి కేంద్రంగా పేర్కొన్నారు. మధ్య, నవీన శిలాయుగం నాటి ఆది మానవుడు ఇక్కడ నివాసం ఉన్నట్లు వివరించారు. ఆకు పసర్లు, రాళ్ల పొడిని కలిపి శిలలపై చిత్రించిన రేఖా చిత్రాలు వేల ఏళ్లుగా చెక్కు చెదరలేదు. ఎరుపు, తెలుపు రంగుల్లో మొత్తం 200 వరకు వర్ణ చిత్రాలు ఉండొచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. వీటిలో దుప్పి, జింక, హైనా, ఎద్దులు, నక్క, ఏనుగులు, కుందేలు, మూపురం, సర్పాలు, రేఖాంశ రూపాలు, పక్షులు, మానవ ఆకృతులు, శృంగారంలో ఉన్న దంపతుల బొమ్మలు సైతం అక్కడ చూడవచ్చు. ఈ రేఖా చిత్రాలు సామాన్య శకానికి పూర్వం 8000-1500 మధ్య కాలం నాటివిగా గుర్తించారు.
- దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ శిలా చిత్రలేఖనాల స్థావరంగా పేరొందిన చింతకుంట ప్రాంతం ఇప్పటివరకూ అభివృద్ధికి నోచుకోలేదు.
- ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులు అక్కడికి చేరుకోవడానికి సరైన రహదారి కూడా లేకపోవడం దురదృష్టకరం. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేసేందుకు కేంద్ర పర్యాటకశాఖ సాస్కి పథకం కింద రూ.77 కోట్ల 90 లక్షలను కేటాయించింది. గండికోటకు 37 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ అరుదైన ఆదిమానవుడి రేఖా చిత్రాలు కలిగిన చింతకుంటను కూడా అభివృద్ధి చేస్తే పర్యాటకులు భారీగా తరలివచ్చి రాష్ట్ర పర్యాటక శాఖకు ఆదాయం సమకూర్చే అవకాశముంది.
నాసిక్‌లో బయటపడ్డ 2 వేల ఏళ్ల నాటి గుహలు
ఏకశిల సౌందర్యం భళా - మంచిర్యాలలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ - Gontemma Gutta in Bellampalle