ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్​ - టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్​, న్యూజిలాండ్​కు ఎదురుదెబ్బ!

డబ్ల్యూటీసీ పాయింట్స్​ టేబుల్​ - న్యూజిలాండ్​కు షాక్​, టీమ్​ఇండియాకు ప్లస్​

WTC Points Teamindia Newzealand
WTC Points Teamindia Newzealand (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 16 hours ago

WTC Points Teamindia Newzealand : మ్యాచ్‌లు ముగుస్తున్న కొద్దీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023-25) ఫైనల్​ రేసు రసవత్తరంగా మారుతోంది. టాప్-2లో నిలిచి తుది పోరులో ఆడటం కోసం ఐదు జట్లు (టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక) పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియాకు బాగా కలిసొచ్చే విషయం ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అదేంటంటే?

డబ్ల్యూటీసీ ఫైనల్​లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్న న్యూజిలాండ్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్​తో జరుగుతోన్న సిరీస్​లో భాగంగా తాజాగా జరిగిన ఓపెనింగ్ మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా న్యూజిలాండ్​కు పెనాల్టీ విధించింది ఐసీసీ. ర్యాంకింగ్స్ టేబుల్​లో మూడు పాయింట్లు కోత విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో టీమ్ ఇండియాకు కలిసొచ్చినట్టైంది. ఈ కోత వల్ల ప్రస్తుతం అగ్రస్థానంలో (61.11) ఉన్న టీమ్ ఇండియా, తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

న్యూజిలాండ్​ ఈ కోత వల్ల ప్రస్తుతం 47.92కు పడిపోయింది. నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఇంగ్లాండ్​తో జరుగుతోన్న సిరీస్​లో మరో రెండు విజయాలు సాధించినా 55.36 వరకు మాత్రమే వెళ్తుంది. అయితే న్యూజిలాండ్​కు పాయింట్ల కోత విధించడంతో సౌతాఫ్రికా (59.26), ఆస్ట్రేలియా (57.26), శ్రీలంక (50) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. వారి పాయింట్ల శాతం కూడా ఎక్కువ ఉండడంతో, న్యూజిలాండ్​ టాప్ 2లోకి వెళ్లడం కష్టమే.

ఇకపోతే తాజాగా జరిగిన ఈ ఓపెనింగ్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​తో పాటు ఇంగ్లాండ్​కు కూడా పాయింట్ల కోత విధించింది ఐసీసీ. "వచ్చే ఏడాది లార్డ్​లో జరిగే ఐసీసీ వరల్డ్ ఛాంపియన్​షిప్ ఫైనల్​లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిరీస్​లో భాగంగా జరిగిన ఓపెనింగ్ టెస్ట్ మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​ జట్లకు పెనాల్టీ విధించాం. రెండు జట్లకు తమ మ్యాచ్ ఫీజులలో 15 శాతం కోత విధించాం. అలానే కీలకమైన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడు పాయింట్లు కోత విధించాం." అని ఐసీసీ పేర్కొంది.

అయితే ఓపెనింగ్ మ్యాచ్​లో ఇంగ్లాండ్ మంచి విజయం సాధించినప్పటికీ, ఆ జట్టు ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ రేసు నుంచి వైదొలిగింది. కాబట్టి ఈ పాయింట్ల కోత వల్ల ఇంగ్లాండ్​కు నష్టమేమీ లేదు. న్యూజిలాండ్​కు మాత్రమే పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. నాలుగో స్థానంలో ఉన్న ఆ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్​ రేసులో ముందుకెళ్లడం న్యూజిలాండ్​కు కష్టమే. ఒకవేళ న్యూజిలాండ్ రేసులో ముందుకెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఐపీఎల్‌ 2025 వేలంలో అన్‌సోల్డ్‌ - ఇప్పుడేమో టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డ్​

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇతడు - 70 వేల కోట్ల ఆస్తి! - 22 ఏళ్లకే రిటైర్మెంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.