Khara Bath with Neer Chutney Recipe in Telugu : రెగ్యులర్‌గా ఎవరికైనా ఇడ్లీ, దోశ, బోండా, పూరీ వంటివి తినాలంటే బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందులోనూ ఇక ఉప్మా అంటే అస్సలే నచ్చదు. అలాంటి వారికోసం ఒక అద్దిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. కర్ణాటక స్పెషల్ "కారా బాత్ విత్ నీరు చట్నీ". దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత రుచికరంగా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలైతే ఈ రెసిపీని మరింత ఇష్టంగా తింటారు! మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
కారా బాత్ కోసం :
- రవ్వ - 1 కప్పు
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- నెయ్యి - 4 టేబుల్‌స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 15
- శనగపప్పు - అరటేబుల్‌స్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
- అల్లం తురుము - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 2(సన్నగా తరుక్కోవాలి)
- ఉప్పు - రుచికి సరిపడా
- బఠాణీ - 1 టేబుల్‌స్పూన్
- క్యారెట్ తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- క్యాప్సికం తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- బీన్స్ తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- టమాటా తరుగు - పావు కప్పు
- పసుపు - అరటీస్పూన్
- చక్కెర - 1 టీస్పూన్
- పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్‌స్పూన్లు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - 1 టేబుల్‌స్పూన్
- వాంగి బాత్ మసాలా పొడి - 1 టీస్పూన్
నీరు చట్నీ కోసం :
- అంగుళం ముక్క - అల్లం
- వెల్లులి రెబ్బలు - 8
- పచ్చిమిర్చి - 5
- కొత్తిమీర - కొద్దిగా
- పుదీనా ఆకులు - 10 నుంచి 15
- ఉప్పు - రుచికి సరిపడా
- పుట్నాల పప్పు - 2 టీస్పూన్లు
- పచ్చికొబ్బరి ముక్కలు - 200 గ్రాములు
- చింతపండు - చిన్న పిక్క
తాలింపు కోసం :
- ఆయిల్ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - రెండు
- ఇంగువ - 2 చిటికెళ్లు
- కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా రెసిపీలోకి కారా బాత్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టౌపై కడాయి పెట్టుకొని 2 టేబుల్స్పూన్ల నెయ్యి, 1 టేబుల్‌స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక జీడిపప్పు పలుకులను వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
- అనంతరం అదే పాన్‌లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్ మీద తాలింపుని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగాక.. అందులో అల్లం తురుము, సన్నని పచ్చిమిర్చి తరుగు వేసి 10 సెకన్ల పాటు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరుకున్న ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించుకోవాలి.
- ఆనియన్స్ వేగిన తర్వాత బఠాణీ, సన్నగా తరుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికం తరుగు వేసి మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ మంచి అరోమా వచ్చే వరకు వేయించాలి. అందుకోసం 8 నిమిషాల సమయం పట్టొచ్చు.
- రవ్వ చక్కగా వేగి తెల్లబడ్డాక.. టమాటా ముక్కలు వేసి కలుపుతూ నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో 3 కప్పుల వేడి నీరు, చక్కెర, పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా మిశ్రమం ఉడికిందనుకున్నాక.. అందులో వాంగి బాత్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
- అనంతరం మిశ్రమంపై మరో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కదపకుండా మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని నిమ్మరసం, పచ్చికొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇక చివరగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే చాలు. కారాబాత్ రెడీ!
- ఇక ఇప్పుడు అందులోకి కావాల్సిన నీరు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో పైన చట్నీ కోసం చెప్పిన పదార్థాలతో పాటు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చిక్కని సాంబార్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి.
- అనంతరం ఆ చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్ మీద శనగపప్పు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవాలి.
- ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మధ్యలో కారా బాత్ పెట్టుకొని చుట్టూ నీరు చట్నీ పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "కారా బాత్ విత్ నీరు చట్నీ" రెసిపీ రెడీ!
ఇవీ చదవండి :
జొన్నలతో రొట్టెలు, దోశలే కాదు - ఇలా "ఉప్మా"ను ప్రిపేర్ చేసుకోండి! - ఆరోగ్యానికి ఎంతో మేలు!
పోషకాలతో నిండిన అన్ని పప్పుల అద్భుత "కిచిడీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!