Highest Paid Athlete : 2025 ఐపీఎల్కుగాను యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ రూ.27 కోట్లు అందుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే అత్యధిక ధర. సీజన్ మొత్తానికిగాను పంత్‌కు ఈ శాలరీ అందుతుంది. అయితే ఓ ప్లేయర్ నిమిషానికే రూ.21 కోట్లు అందుకున్నాడని మీకు తెలుసా? షాకింగ్‌గా ఉన్నా ఆ ఆటగాడు నిజంగానే 60 సెకన్లకు రూ.21 కోట్లు తీసుకున్నాడు. అతడేవరంటే?
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటకు ఉండే క్రేజ్ వేరు. ఈ క్రేజ్ వల్ల ఆ అథ్లెట్లు కూడా భారీగానే సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్‌మర్, ఓ లీగ్‌లో ఆడినందకు భారీ మొత్తం శాలరీ అందుకున్నాడు. 2023లో నెయ్‌మర్ సౌదీ అరేబియన్ ప్రో లీగ్ జట్టుతో కలిశాడు. దీంతో 2024 సీజన్‌కుగాను సౌదీ ఫ్రాంచైజీ అతడితో రూ.895 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే నెయ్‌మర్ ప్రపంచంలోనే అత్యధిక శాలరీ అందుకున్న టాప్-3 ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు.
ఇక 2024లో నెయ్‌మర్ ఆ జట్టు తరఫున ఆడింది కేవలం 42 నిమిషాలే. ఈ లెక్కన అతడు నిమిషానికి సుమారు రూ.21.30 కోట్లు అందుకున్నాడన్న మాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అతడు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 45 సార్లు మాత్రమే బంతిని టచ్ చేశాడు. ఇక చివరిసారిగా 2024 నవంబర్‌లో నెయ్‌మర్ బరిలోకి దిగాడు.
కాంట్రాక్ట్ రద్దు!
కాగా, సౌదీ అరేబియన్ ఫ్రాంచైజీ మరో సీజన్పాటు నెయ్‌మర్‌ను జట్టులో కొనసాగించనుంది. 2025 సీజన్‌కు గాను ఫ్రాంచైజీ అతడితో 107 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.925.18 కోట్లు) తో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జూన్‌లో ముగియనుంది. అయితే నెయ్‌మర్ తరచూ గాయపడుతుండడం ఫ్రాంచైజీకి ఆందోళన కలిగిస్తోంది. దీంతో అతడి కాంట్రాక్ట్ రద్దు చేసుకునేందుకు ఫ్రాంచైజీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
💸 Foot Mercato: “Neymar's Al-Hilal salary in 2024 broken down”.
— Richard Dan (@RichardEno) January 11, 2025
✌️ Two matches
⏱️ 42 minutes on the pitch
💰 €50.5M per appearance
💰 €2.4M for every minute.
💰 €1.1M for each touch of the ball.
💰 €101M total salary. pic.twitter.com/6MWW6sH3WB
అదే లాస్ట్
2026 ప్రపంచకప్ ఫుట్‌బాల్ తన కెరీర్‌లో చివరిదని నెయ్‌మార్ చెప్పాడు. యుఎస్‌ఎ, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్‌లో సత్తా చాటుతానని నెయ్‌మర్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నాడు.