U19 Asia Cup Teamindia : అండర్ - 19 ఆసియా కప్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. జపాన్‌పై యువ భారత్ 211 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ భారీ ఛేదనలో జపాన్ 50 ఓవర్లలో 128/8కే పరిమితమవ్వడంతో ఓటమి తప్పలేదు. దీంతో భారత్‌కు భారీ విజయం దక్కింది.
ఓపెనర్ హ్యూగో కెల్లీ (111 బంతుల్లో 50;) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఛార్లెస్ హింజ్ (35) మంచిగానే రాణించాడు. మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్, కార్తికేయ, చేతన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా, యుధజిత్ ఒక వికెట్ తీశాడు.
అదిరే ప్రదర్శన చేసిన అమన్ - టీమ్ ఇండియా కెప్టెన్ మహ్మద్ అమన్ (118 బంతుల్లో 122*; 7 ఫోర్లు) సెంచరీ బాదడం వల్ల జట్టుకు భారీ స్కోరు లభించింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే ( 29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదిరే ఇన్నింగ్స్ ఆడాడు.
వైభవ్ సూర్యవంశీ (23 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. కార్తికేయ (50 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖర్లో హార్దిక్ రాజ్ (12 బంతుల్లో 25*; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించారు.
ఇకపోతే యంగ్ టీమ్ ఇండియా తన తర్వాతి మ్యాచ్‌ను డిసెంబరు 4న యూఏఈతో పోటీ పడనుంది.
రూ.23 కోట్ల ప్లేయర్ కాదు, రూ.1.5 కోట్ల ప్లేయరే ఆ జట్టుకు సారథి!