ETV Bharat / state

నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా - సినిమా స్టోరీలు రాసుకుంటా : రాంగోపాల్ వర్మ - RGV PRESSMEET ON POLICE CASE

తాను ఎక్కడి పారిపోలేదని కొన్ని మీడియా సంస్థలు లేనిపోని వార్తలు రాస్తున్నాయన్న దర్శకుడు రాంగోపాల్​ వర్మ - సోషల్ మీడియాను రెగ్యులరైజ్ చేయడం కష్టమని వ్యాఖ్య

Ram Gopal Varma Pressmeet On Police Case
Ram Gopal Varma Pressmeet On Police Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2024, 10:37 PM IST

Ram Gopal Varma Pressmeet On Police Case : ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, అక్కడ ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా స్టోరీలు రాసుకుంటానని వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తనపై నమోదైన కేసులు, ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై వర్మ అసహనం వ్యక్తం చేశారు.

సోషల్​ మీడియాను రెగ్యులరైజ్​ చేయడం కష్టం : 'సామాజిక మాధ్యమాలను రెగ్యులరైజ్‌ చేయడం కష్టం. చట్టంలో నాకున్న(ఆర్​జీవీ) అవకాశాలను బట్టి పోలీసులకు సమాధానమిచ్చాను. నేను హైదరాబాద్‌ నగరంలో ఉన్నాను. లైవ్‌లో ఇంటర్వ్యూలను ఇస్తున్నాను. పోలీసులు ఇంకా నన్ను పట్టుకోలేదని చాలా మంది అంటున్నారు. నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తాను 4 సినిమా కథలు రాసుకుంటా. గత కొన్నేళ్లుగా నా ఎక్స్(సోషల్ మీడియా) అకౌంట్‌లో వేల పోస్టులను పెట్టాను. వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది కాలం తర్వాత స్పందించారు. సంవత్సరం తర్వాత నాలుగైదుగురు ఒకేసారి మేల్కొనడం ఏంటీ? పలు జిల్లాల్లో నాపై కేసులు పెట్టారు. నాకున్న పనులు, కమిట్‌మెంట్స్‌ వల్ల నేను హాజరుకాలేనని కోర్టుకు రిక్వెస్ట్​ చేసుకున్నాను' అని రాంగోపాల్​ వర్మ తెలిపారు.

'నన్ను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు(ప్రసారమాధ్యమ) నా డెన్‌కు (వర్మ ఇంటికి) వచ్చాయి. నేను అక్కడ లేకపోవడంతో పరారీలో ఉన్నాడని, మంచం కింద దాక్కున్నాడని కొన్ని ప్రసారమాధ్యమ సంస్థలు కథనాలు(స్టోరీలు) అల్లాయి. నా కోసం కోయంబత్తూరు, కేరళలో ఏపీ పోలీసులు గస్తీ పడుతున్నారని రాశారు. నా అరెస్టు గురించి ఏ పోలీసు ఆఫీసర్​ కూడా అధికారికంగా చెప్పలేదు కదా! లేని న్యూస్‌ను కొందరు కావాలని క్రియేట్​ చేస్తున్నారు. నా విషయంలో అదే జరిగింది. సామాజిక మాధ్యమాలలో అతి చేయొద్దని అంటున్నారు. అది మీరెలా చెబుతారు. ఒక కార్టూన్ పోస్టును వివిధ రకాల కోణల్లో ఆపాదించుకోవచ్చు. నన్ను కోట్‌ చేస్తూ మెయిన్​స్ట్రీమ్​ మీడియా సంస్థలు పోస్టులు కూడా పెడుతున్నాయి. నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెబుతున్నప్పటికీ ‘పరారీలో ఉన్నాడు' అంటారు. పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు? సర్కారు మారినా పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రచారం చేశారు' అని రాంగోపాల్​ వర్మ అన్నారు.

నన్ను దాచిపెట్టారని మీడియా దుష్ప్రచారం : 'ప్రకాశ్‌రాజ్ , నాగార్జున నన్ను దాచిపెట్టారని మీడియా దుష్ప్రచారం చేసింది. పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్‌లా మారింది. కార్టూన్ అనేది వ్యంగ్యంగా చెప్పేటువంటి ఒక అంశం. నా గురించి ఎన్నో రకాలుగా అసభ్య పదజాలంతో తిడుతూ మీమ్స్ పెడతుంటారు. అమెరికా లాంటి దేశం కూడా మీమ్స్​ను కంట్రోల్​ చేయలేకపోయింది. సోషల్‌మీడియా వచ్చిన తర్వాత అది మరింత జటిలమైంది. ప్రతి మనిషికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అవి అందరికీ వర్తిస్తాయి' అని రాంగోపాల్​ వర్మ తెలిపారు.

'నేను నా డెన్​లోనే ఉన్నా - పోలీసులు ఇంతవరకు నా ఆఫీసులో కాలు పెట్టలేదు'

RGV Tweet: రాజకీయ నేపథ్యంగా సినిమా... ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.