ETV Bharat / entertainment

ఏపీలో 'పుష్ప 2' టికెట్‌ ధరల పెంపు - ఎంతంటే? - PUSHPA 2 TICKET PRICES AP

అల్లు అర్జున్‌ పుష్ప 2 టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

Pushpa 2 Ticket prices AP
Pushpa 2 Ticket prices AP (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 10:22 PM IST

Updated : Dec 2, 2024, 10:51 PM IST

Pushpa 2 Ticket prices AP : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' టికెట్‌ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీనికి సంబంధించి అధికారిక జీవోను విడుదల చేసింది.

డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800 నిర్ణయించారు (జీఎస్టీ అదనం). ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం రూ.800+GST చెల్లించాలి. (తెలంగాణలో అయితే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు రూ.800 అదనం).

పుష్ప 2 రిలీజ్​ రోజై డిసెంబర్ 5న ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో లోయర్‌ క్లాస్‌ రూ.100 (జీఎస్టీతో కలిపి), అప్పర్‌ క్లాస్‌ రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీఫ్లెక్స్‌లో రూ.200 (జీఎస్టీతో కలిపి) పెంచారు. డిసెంబర్ 6 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

డిసెంబరు 17 వరకు పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు అల్లు అర్జున్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Pushpa 2 Cast and Crew : కాగా, పుష్ప 2 ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సుకుమార్ దర్శకత్వం వహించారు. సినిమా రన్‌ టైమ్ విషయానికొస్తే 3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండనుంది. ఇందుకు సంబంధించిన సెన్సార్‌ కూడా పూర్తైపోయింది. పుష్ప 2కు యూ/ఏ సర్టిఫికెట్​ వచ్చినట్లు మూవీ టీమ్ అఫీషియల్​గా ప్రకటించింది. ఇకపోతే రిలీజ్​కు ముందే బుక్సింగ్స్‌, సాంగ్స్‌ వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది పుష్ప 2.

'పుష్ప 2' టికెట్ హైక్- బెనిఫిట్​ షో కాస్ట్ ఎంతంటే?

'అప్పుడు బన్నీతో అలా చెప్పా - కానీ ఇప్పుడు అవసరం లేదు' : రాజమౌళి

'పుష్ప 2' - రష్మికకు ఆ సెంటిమెంట్​ కలిసొస్తుందా?

Last Updated : Dec 2, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.