తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ సంచలన నిర్ణయం - కెప్టెన్ హర్మన్​ప్రీత్​పై వేటు!

టీ20 ప్రపంచకప్​లో విఫలమైన నేపథ్యంలో షాకింగ్​ నిర్ణయం తీసుకోబోతున్న బీసీసీఐ!

Harmanpreet Kaur Captaincy
Harmanpreet Kaur Captaincy (source IANS and Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 16, 2024, 12:55 PM IST

Harmanpreet Kaur Captaincy : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత జట్టు సెమీ ఫైనల్​కు చేరలేకపోయింది. పేలవమైన ప్రదర్శనతో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఫలితంగా ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళల జట్టుకు కప్ అందని ద్రాక్షగానే మిగిలింది. అంతేగాక ఈ సారి సెమీస్​కు కూడా చేరుకోకపోవడం వల్ల బీసీసీఐ చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీమ్ ఇండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్​పై వేటుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

హర్మన్ కెప్టెన్సీపై నిర్ణయం -హర్మన్‌ ప్రీత్ కెప్టెన్సీ భవితవ్యంపై సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్​లతో బీసీసీఐ మరికొద్ది రోజుల్లో సమావేశం కానుందని తెలిసింది. ఈ మీటింగ్​లో హర్మన్ ప్రీత్ కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే 2025లో భారత్​లోని మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగాటోర్నీలో భారత్ విజేతగా నిలిచేలా కార్యచరణ సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ స్థానంలో మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వేటు తప్పదా? - 2016లో టీ20 వరల్డ్ కప్​లో భారత మహిళల జట్టు సెమీఫైనల్​కు వెళ్లలేకపోయింది. ఈ దశలో మిథాలీ రాజ్ నుంచి టీ20 జట్టు పగ్గాలను హర్మన్‌ ప్రీత్ కౌర్ అందుకుంది. 2020 టీ20 ప్రపంచకప్​లో జట్టును ఫైనల్​కు చేర్చింది. అయితే దుబాయ్ వేదికగా జరుగుతున్న తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లో జట్టును సెమీస్​కు చేర్చడంలో విఫలమైంది. అందుకే ఆమెపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.

'ప్లేయర్ గా ఆమె ఢోకా లేదు' - హర్మన్‌ ప్రీత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించినా జట్టులో ప్లేయర్​గా ఆమె స్థానానికి ఢోకా లేదు. అయితే భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు జట్టు పగ్గాలు అప్పగించి, వన్డే వరల్డ్ కప్​నకు టీమ్ ఇండియాను సిద్ధం చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. "హర్మన్ ప్రీత్​నే కెప్టెన్​గా కొనసాగించాలా? లేదా కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలా? అనే విషయంపై బీసీసీఐ కచ్చితంగా చర్చిస్తుంది. జట్టు కోరుకున్న ప్రతిదాన్ని బీసీసీఐ అందించింది. జట్టును నడిపించేందుకు కొత్త సారథి అవసరమయ్యే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం. హర్మన్‌ ప్రీత్ జట్టులో ప్లేయర్​గా ఉంటారు." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కివీస్​తో తొలి టెస్ట్​లో ఆగని వర్షం - సబ్‌ఎయిర్‌ సిస్టమ్‌ కాపాడుతుందా?

భారత్. న్యుజిలాండ్​ తొలి టెస్ట్​ - OTTలో ఎక్కడ చూడాలంటే?

ABOUT THE AUTHOR

...view details