House owner writes Letter To Thieves : దొంగలకే షాక్ ఇచ్చాడు ఓ ఇంటి యజమాని. తాము కుటుంబంతో కలిసి సంక్రాంతికి ఊరికి వెళ్తున్నామని, 'ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని పోతున్నాం, ఇంట్లో ఏం లేవు, మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి' అంటూ ఒక పేపర్లో రాసి తలుపులకు అంటించి మరీ వెళ్లారు. ఇది ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, సోషల్ మీడియా కంట పడటంతో ప్రస్తుతం వైరల్గా మారింది.

సహజంగా సంక్రాంతి పండుగకి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇంటికి వెళుతూ ఉంటారు. తాళాలు వేసిన ఇల్లు ఎక్కువగా ఉండటంతో దొంగలు ఇదే సరైన సమయంగా భావించి దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఒక ఇంటి యజమాని ఈ రకంగా లెటర్ రాయడం కొంత హాస్యాస్పదంగా ఉన్నా, ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఇతను ఎవరో దొంగలకే లెటర్ రాశాడు అంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.