ETV Bharat / sports

టీమ్ఇండియా నెక్స్ట్​ కెప్టెన్​గా యశస్వి జైశ్వాల్! గంభీర్​ మనసులో ఏముంది? - YASHASVI JAISWAL NEXT INDIA CAPTAIN

రోహిత్​ శర్మ తర్వాత టీమ్​ఇండియా కెప్టెన్​ ఎవరు అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి - యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్​ నియమించాలని భావిస్తున్న గంభీర్? బుమ్రా, పంత్​కు మొండిచేయి!

Yashasvi Jaiswal Next India Captain
Yashasvi Jaiswal Next India Captain (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 14, 2025, 8:14 AM IST

Yashasvi Jaiswal Next India Captain : టీమ్ఇండియా తదుపరి కెప్టెన్​గా ఎవరొస్తారు? రోహిత్‌ శర్మ వారసుడు ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్​-గావస్కర్ ట్రోఫీలోనే రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ గురించి చర్చ జరిగింది. ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ స్టార్ బ్యాటర్, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో టెస్టుల నుంచి కూడా హిట్​మ్యాన్​ తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మరి కొంత కాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడు.

'బుమ్రా విషయంలో అనుమానాలు!'
అయితే, జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే వరకు రోహిత్‌ టెస్టు జట్టులో కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో రోహిత్‌ వారసుడు ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టీమ్​ఇండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్‌ బుమ్రాపై చర్చ నడుస్తోంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్‌ అందుబాటులో లేకుంటే బుమ్రా జట్టుకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఆ టెస్టులో భారత్​ ఘనవిజయం సాధించింది. ఇదంతా బాగానే ఉన్నా బుమ్రా ఫిట్‌నెస్‌ మీద సందేహాలు నెలకొనడం, టెస్టు కెరీర్‌ను ఎంతమేర పొడిగించుకోగలడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అతడికి కెప్టెన్ బాధ్యతలు అప్పగించే విషయంలో సెలక్టర్లు, కోచ్‌ ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

గంభీర్​ మనసులో ఏముంది?
ఈ క్రమంలో యంగ్​ బ్యాటర్ యశస్వి జైస్వాల్, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ల పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నిలకడగా రాణిస్తూ టెస్టు జట్టులో సుస్థిర స్థానం దిశగా జైశ్వాల్ అడుగులు వేస్తున్నాడు. అతడిని కెప్టెన్​గా నియమిస్తే బాగుంటుందని కోచ్‌ గంభీర్‌ భావిస్తున్నాడట. జైస్వాల్‌ శ్రద్ధగా ఆట మీద దృష్టిపెట్టే తీరు, తన నిలకడను చూసి సారథ్య బాధ్యతలు అప్పగించాలని గంభీర్‌ కోరుతున్నాడట.

టీమ్​ఇండియా తదుపరి కెప్టెన్ విషయంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం అనుభవజ్ఞుడైన రిషభ్​ పంత్‌ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరీ దూకుడుగా, కొన్నిసార్లు బాధ్యతారాహిత్యంగా ఆడతాడని విమర్శలు ఎదుర్కొనే పంత్‌ను జట్టు సారథిగా నియమించడం సరైన ఆలోచనేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, కెరీర్‌ తొలి దశలోనే ఉన్న, మరీ కుర్రాడైన యశస్విని కెప్టెన్​గా ఎంపిక చేయడం పైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.