తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPLలో 'నరైన్' అన్​స్టాపబుల్- పంజాబ్​పై ఒక్కడై పోరాడిన KKR ప్లేయర్! - IPL 2024 - IPL 2024

Sunil Narine IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్​లో కేకేఆర్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ రెచ్చిపోతున్నాడు. కెరీర్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Sunil Narine IPL 2024
Sunil Narine IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 9:11 AM IST

Sunil Narine IPL 2024:2024 ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అటు బ్యాట్, ఇటు బంతితోనూ అదరగొడుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సీజన్​లో కేకేఆర్​కు కీలక ప్లేయర్​గా మారి జట్టుకు శుభారంభాలు ఇవ్వడంలో సక్సెస్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లోనూ నరైన్ అద్భతంగా ఆడాడు. ఈ మ్యాచ్​లో కేకేఆర్ ఓడినప్పటికీ నరైన్ మాత్రం పలువురు మాజీల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎందుకంటే?

ఒకే ఒక్కడు
ఈ మ్యాచ్​లో ఇరుజట్లు కలిపి 523 పరుగులు నమోదు చేశాయి. ఐపీఎల్​ ఇది రెండో అత్యధిక మొత్తం. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్​లో నరైన్ బౌలింగ్ అందర్నీ ఆకట్టుకుంది. అతడు 4 ఓవర్లలో కేవలం 6.00 ఎకానమీతో 24 పరుగులిచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మిగతా కేకేఆర్ బౌలర్లంతా కలిసి 14.4 ఓవర్లలో 16.09 ఎకానమీతో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 236 పరుగులు సమర్పించుకున్నారు. ఇక్కడే నరైన్ సామర్థ్యం ఏంటో అర్థమైంది. మ్యాచ్ మొత్తంలో 6 అంతకంటే తక్కువ ఎకనమీ రేట్​తో బౌలింగ్ చేసింది నరైన్ ఒక్కడే. ఇక హర్షిత్ రానా (కేకేఆర్) 61 పరుగులు, శామ్ కర్రన్ 60 పరుగులు (పంజాబ్) అత్యధిక పరుగులు ఇచ్చుకున్నారు.

బ్యాటింగ్​లోనూ తగ్గేదేలే
తొలుత బ్యాటింగ్​లో నరైన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లను ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ స్కోర్ బోర్డను జెట్ స్పీడ్​తో పరుగులు పెట్టించాడు. ఏకంగా 221.88 స్ట్టైక్ రేట్​తో పరుగులు చేశాడు. కేవలం 32 బంతుల్లోనే నరైన్ 71 పరుగులతో ఔరా అనిపించాడు. అతడు ఫిల్ సాల్ట్​తో కలిసి తొలి వికెట్​కు 10.2 ఓవర్లలోనే 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సాల్ట్​తో సమన్వయలోపంతో రనౌట్​గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. లేకపోతే ఇంకెంత విధ్వంసం సృష్టించేవాడో.

2, 47, 85, 27, 6, 109, 10, 71 ఇవి ప్రస్తుత సీజన్​లో నరైన్ వరుసగా సాధించిన స్కోర్లు. ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్​​ల్లో 184.02 స్ట్రైక్ రేట్​తో 357 పరుగులు సాధించాడు. ఇందులో 24 సిక్స్​లు ఉండడం విశేషం. ఇక బంతితోనూ రాణిస్తున్న నరైన్ 22.30 సగటుతో 10 వికెట్లు దక్కించుకున్నాడు. ఇకపై కూడా నరైన్ ఇలాగే ఆల్​రౌండ్ ప్రదర్శనతో రెచ్చిపోతే కేకేఆర్​కు తిరుగుండదు!

IPLలో 'సన్​రైజర్స్' కొత్త చరిత్ర- 17ఏళ్ల రికార్డ్ సెట్ చేసిన హైదరాబాద్ - IPL 2024

'అది జరగని పని, దానికి డోర్స్ క్లోజ్'- సునీల్ నరైన్ కామెంట్స్! - Sunil Narine T20 World Cup

ABOUT THE AUTHOR

...view details