Sarfaraj Khan Jersey No:26 ఏళ్ల యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే, సర్ఫరాజ్‌కు టెస్టు క్యాప్ అందించాడు. దీంతో సర్ఫరాజ్ టెస్టుల్లో టీమ్ఇండియా తరఫున ఆరంగేట్రం చేసిన 311వ ప్లేయర్‌గా నిలిచాడు. ఇక నెం.97 జెర్సీ ధరించి సర్ఫరాజ్ బరిలోకి దగనున్నాడు. అయితే తన జెర్సీపై ఇదే నెంబర్ ఉంచుకోడానికి ఓ స్పెషల్ కారణం ఉంది అదేంటంటే.
సర్ఫరాజ్ తండ్రి పేరుకు గుర్తుగా నెం.97 ఎంపిక చేసుకున్నాడట. అతడి తండ్రి పేరు నౌషద్ ఖాన్. అయితే ఈ పేరును విడదీస్తే 'నౌ సాత్' అవుతుంది. హిందీలో నౌ అంటే 9, సాత్ అంటే 7 అని అర్థం. దీంతో అతడు 97 నెంబర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడట. అయితే సర్ఫరాజ్ నెం.97 జెర్సీ ధరించడం ఇదేం కొత్త కాదు. అండర్- 19, ఐపీఎల్‌లోనూ ఇదే నెంబర్ జెర్సీ ధరించాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడడం వల్ల ఇది వైరలైంది.
ఇక మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ టెస్ట్ క్యాప్ అందుకోగానే అతడి తండ్రి, భార్య ఎమోషనలయ్యారు. కన్నీళ్లతో సర్ఫరాజ్‌ను హత్తుకొని, అతడి టెస్టు క్యాప్‌ను ముద్దాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. కెరీర్లో బెస్ట్ అచీవ్మెంట్, కంగ్రాట్స్ అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.