U19 World Cup Trisha Gongadi : అండర్- 19 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా టీమ్ఇండియా మహిళల జట్టు అవతరించింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టు విజయం కీలక పాత్ర పోషించింది. 44 పరుగుల చేసిన ఆమె, బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలో త్రిషకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సహా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డు దక్కింది.
మిథాలీ రాజ్ నా రోల్ మోడల్ : త్రిష
అండర్- 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం త్రిష మాట్లాడింది. మిథాలీ రాజ్ తనకు రోల్ మోడల్ అని వెల్లడించింది. తనకు సహకరించిన టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. ప్రతి అండర్- 19 వరల్డ్ కప్ భారత్‌తోనే ఉండాలన్నది తన కోరికని పేర్కొంది. యంగ్ క్రికెటర్లకు అదే చెప్తానని వెల్లడించింది.
"నా తండ్రికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను నేను ఎప్పుడూ ఆల్ రౌండర్‌గా భావిస్తాను. దేశం తరపున ఆడటం, మరిన్ని మ్యాచ్‌లు గెలవడమే నా లక్ష్యం. నా బలం మీద నేనెప్పుడూ దృష్టిసారిస్తాను. ఈరోజు కూడా అదే పని చేశాను"అని త్రిష వ్యాఖ్యానించింది.
మరో రికార్డు త్రిషకు దాసోహం
కాగా, గొంగడి త్రిష ఈ టోర్నీలో 309 పరుగులు చేసింది. ఈ క్రమంలో అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కింది. ఈ ఘనత ఇప్పటివరకు టీమ్ ఇండియా ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ పేరిట ఉండేది.
మన తెలుగమ్మాయే
తెలంగాణాలోని భద్రాచలానికి చెందిన త్రిష గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో స్థిరంగా రాణిస్తోంది. ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియాకప్ లో 5 మ్యాచుల్లో 53 సగటుతో 159 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ ఫామ్‌నే తాజా ప్రపంచకప్ లోనూ కొనసాగించింది. ఏడు మ్యాచుల్లో ఏకంగా 309 పరుగులు బాదింది. అలాగే ఏడు వికెట్లు సైతం తీసింది. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సహా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డులు దక్కాయి.