Rs 100 Crore Deal Cricketer:భారత్‌లో మూవీ స్టార్లు, క్రికెట్ ప్లేయర్‌లకు ఉన్న సంపాదన, క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఐపీఎల్ రాకతో క్రికెటర్ల ఆదాయం చాలా రెట్లు పెరిగింది. పైగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్‌లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ వంటి పాపులర్ ప్లేయర్లు దాదాపు రూ.1000+ కోట్ల నెట్‌వర్త్ కలిగి ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది ప్లేయర్‌లు వివిధ కంపెనీలకు అడ్వెర్టైజ్‌మెంట్‌లు చేస్తూ, భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే తక్కువ వయసులో రూ.100 కోట్ల డీల్ కుదుర్చుకున్న క్రికెటర్ ఎవరో తెలుసా?
28 ఏళ్లకు రూ.100 కోట్ల ఒప్పందం
2001లో సచిన్ రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. దివంగత మార్క్ మస్కరెన్హాస్ నేతృత్వంలోని వరల్డ్‌టెవ్ స్పోర్ట్స్ ఏజెన్సీ, ఆఫ్-ఫీల్డ్ ఎర్నింగ్స్‌లో సచిన్‌కి ఈ భారీ మొత్తానికి హామీ ఇచ్చింది. భారతదేశంలో సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులకు ప్రసిద్ధి చెందిన మస్కరెన్హాస్ ఈ అద్భుతమైన ఒప్పందాన్ని రన్ చేశారు. ఈ డీల్ అప్పటి 28 ఏళ్ల యువకుడిని ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెటర్‌గా చేసింది.
సచిన్, మార్క్ జర్నీ 1995 నాటిది. సచిన్ మొదటిసారిగా మస్కరెన్హాస్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థతో రికార్డు స్థాయిలో రూ.45 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్క్, 22 ఏళ్ళ వయసులో సూపర్ స్టార్‌డమ్‌లో ఉన్న సచిన్‌ని గుర్తించాడు. క్రికెటర్ కెరీర్‌లో వాణిజ్యపరమైన అంశాలను మేనేజ్ చేశాడు. ఇది సచిన్, మస్కరెన్హాస్ ఇద్దరికీ లాభాలు తెచ్చి పెట్టింది.