ETV Bharat / spiritual

సంగీతంతో శ్రీరాముడ్ని సేవించిన మహానుభావుడు- త్యాగరాజు గురించి ఈ విషయాలు తెలుసా? - THYAGARAJA LIFE HISTORY

సంగీత కళానిధి త్యాగరాజ జీవిత విశేషాలు మీకోసం!

Thyagaraja Life History
Thyagaraja Life History (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 2:16 AM IST

Life History Of Thyagaraja Swamy In Telugu : కర్ణాటక సంగీత ప్రియులకు, సంగీతాన్ని ఊపిరిగా భావించే వారికి త్యాగరాజు పూజ్యనీయుడు. తన సంగీతంతో శ్రీరాముని సేవించిన మహానుభావుడు త్యాగరాజు. ఆరాధనోత్సవాలు సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఎప్పుడు?
జనవరి 18వ తేదీ శనివారం పుష్య బహుళ పంచమి రోజు నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం అవుతాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ముగ్గురు విద్వాంసులు ఒకే చోట
తంజావూరు దగ్గరి తిరువయ్యార్ అనే ఊరు వాగ్గేయకార త్రయం అని పిలువబడే శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వాములు సమకాలికులు. వీరు ముగ్గురు ఒకే కాలంలో, ఒకే ప్రాంతంలో ఉండడం తిరువయ్యార్ క్షేత్రం చేసుకున్న పుణ్యం.

తెలుగు వారికి గర్వకారణం
వీరు ముగ్గురు ద్రవిడ దేశంలో నివసించిన తెలుగు వారు కావడం మన తెలుగు వారి అదృష్టం. మొదటి ఇద్దరు ప్రధానంగా సంస్కృతంలో కృతి రచన చేసినప్పటికీ మన త్యాగరాజుల వారు తెలుగునే ఎంచుకోవడం తెలుగు వారి పరమ సౌభాగ్యం. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు ఈనాటికీ తిరువయ్యారులో బ్రహ్మోత్సవం లాగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో నాదోపాసకులు అక్కడ చేరి త్యాగరాజస్వామి ఆరాధనలో భాగంగా త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులను ముక్త కంఠంతో పాడి బ్రహ్మాత్మైక్య స్థితిని పొంది తరిస్తారు. సంగీత ప్రియులు రసాస్వాదనను పొందుతారు.

ఈనాటికి పదిలంగా!
తెలుగునాట పుట్టిన అన్నమాచార్యుల వారి కంటే త్యాగరాజుల వారు కొన్ని శతాబ్దాల తర్వాత వారు కావడం వల్ల ఆయన నెలకొల్పిన సంప్రదాయం నేటికి ద్రవిడ దేశంలో అలాగే పదిలంగా కొనసాగుతోంది.

త్యాగరాజస్వామి జీవిత విశేషాలు క్లుప్తంగా!
త్యాగరాజు తెలుగు ములకనాడు బ్రాహ్మణ కుటుంబంలో రామ బ్రహ్మం గారి కుమారునిగా జన్మించారు. తిరువయ్యారు క్షేత్రంలో శివుని నామాన్ని తన పేరుగా చేసుకున్నారు. చిన్నతనం లోనే త్యాగయ్య సంగీతం పట్ల చూపిన శ్రద్ధ చూసి ఆయన తండ్రి రామబ్రహ్మం ఆయన్ని శుంఠి వెంకటరమణ భాగవతుల వద్ద శిష్యునిగా చేసారు.

నారదుని నుంచి గ్రంథం అందుకున్న త్యాగరాజు
త్యాగయ్య ఎన్నో కృతి రచనలు, ప్రహ్లాద భక్తి విజయం వంటి గేయ నాటకాలు వ్రాసారు. పరమ భాగవతోత్తములైన నారదులవారు ఒకసారి ఓ వృద్ధ బ్రాహ్మణ రూపం లో వచ్చి త్యాగయ్యకు స్వరార్ణవం అనే గ్రంథాన్ని స్వయంగా ఇచ్చారు.

నిధి చాల సుఖమా!
రాజులిచ్చిన మాన్యాలు ధన ధాన్యాదులు వద్దనుకున్నా, రాముని దయతో ఏ లోటు లేకుండా నిత్య సంతర్పణలు చేసుకునే త్యాగయ్య వైభవాన్ని చూసి ఈర్ష్యా పరులు ఆయన నిత్యం అర్చించే రాముల వారి విగ్రహాన్ని నదిలో పారేశారు.

రాముని వెతుకుతూ తీర్ధయాత్రలు
తాను నిత్యం పూజించే రాముడు కనబడకపోవడం వల్ల ఆర్తి పొందిన త్యాగయ్య రాముని వెతుకుతూ అనేక పుణ్య క్షేత్రాలు తిరిగి ఎన్నో కీర్తనలు చేశారు. అప్పటికీ శాంతి చెందక ఉన్న ఆయన ఆర్తి చూసి అంతర్ముఖుడవు కారా నాయనా, రామ దర్శనం అవుతుంది అని నారదులు చేసిన ఉపదేశంతో తొంభై ఆరు కోట్ల రామ నామ జపం మొదలు పెట్టారు! ఆ మహా సాధన క్రమం లో ఆయనకు కలిగిన దర్శనాలే పంచరత్న కృతులు అని పెద్దలు చెప్తారు.

అంతరంగంలో రామదర్శనం
'జగదానంద కారకా' అంటూ రాముణ్ణి స్తుతిస్తూ కీర్తించిన త్యాగయ్య చివరికి సకల భాగవతోత్తములతో కూడిన పరివార సమేతుడైన పట్టాభి రాముణ్ణి తన అంతరంగంలో చూసి 'ఎందరో మహానుభావులు' అన్న కీర్తన చేయడం వల్ల ఆయన సంగీత తపస్సు అద్వితీయమైన స్థితికి చేరింది.

సంగీత ఉత్సవం
త్యాగయ్య రచించిన పంచరత్నాలను గానం చేసుకుంటూ, వింటూ త్యాగయ్యని స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వ పుణ్యం ఉంటే తప్ప సాధ్య పడదు. త్యాగరాజ స్వామి ఆరాధన అంటే స్వరకర్త త్యాగరాజును వార్షికంగా ఆరాధించే సంగీత ఉత్సవం. త్యాగరాజు స్వామి పరమపదించిన రోజున ఈ ఉత్సవాలు జరుగుతాయి.

త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాల గురించి మరిన్ని వివరాలు:
ఈ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతాయి. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి సంగీతాన్ని ఆలపించే విద్వాంసులు, శాస్త్రీయ సంగీతాభిమానులు వస్తారు. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సందర్భంగా ఆ సంగీత కళానిధికి స్మరించుకోవడం తెలుగు జాతి కర్తవ్యం!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.