Horoscope Today January 18th 2025 : 2025 జనవరి 18వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సంతానం పురోగతి పట్ల శ్రద్ధ చూపిస్తారు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. శ్రీ పంచముఖ హనుమ ఆరాధన ఉత్తమం.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పోటీతత్వంతో పనిచేసి అందరినీ ఆకర్షిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. అనుకూల శత్రువులను నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేసి మంచి ఫలితాలు రాబడతారు. కొత్త పనులు, ఒప్పందాలు చేసుకోడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. ఉన్నతాధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. గొడవలకి, వివాదాలకి దూరంగా ఉండండి. మోసపూరిత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేసేపని పట్ల చిత్తశుద్ధి లేకపోతే సత్ఫలితాలు ఉండవు. అనవసర కాలయాపనతో అవకాశాలు చేజారే ప్రమాదముంది. వృత్తి పరంగా భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకునే పనిలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. గొప్ప సాహసంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమైనవి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. పితృవర్గం నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొన్నాళ్లుగా చికాకు పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సానుకూల చర్చలతో వివాదాలకు ముగింపు పలుకుతారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు అదృష్టం కలిసి వచ్చే రోజు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. శుభకార్యాలలో బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులకు విపరీతమైన లాభాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి. వైవాహిక జీవనం సుఖంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సాన్నిహిత్యం పెరుగుతుంది. తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు, స్నేహితుల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి, పరపతి, ప్రశంసలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంత కాలంగా ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూటికి నూరు శాతం ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులు, వృత్తి నిపుణులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువర్గంతో, పోటీదారులతో వాదనల్లోకి దిగవద్దు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. అభయ ఆంజనేయస్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే పనులేవీ చేయవద్దు. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. ప్రయాణాలలో ధనం విపరీతంగా ఖర్చవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణతో మనోబలం పెరుగుతుంది.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా శుభవార్తలు అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విష్ణువు ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) : మీనరాశి వారికి నేడు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగు విజయాన్ని అందిస్తాయి. సాహసోపేతమైన విజయాలను అందుకుంటారు. మీ నిర్ణయాలకీ, మీ వైఖరికి మీరే ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా స్నేహితుల నించి సహకారం అందుకుంటారు. గృహంలో శాంతి నెలకొంటుంది. మాతృవర్గం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన శ్రేయస్కరం.