ETV Bharat / international

జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఫోన్‌ - వాణిజ్యం సహా కీలక సమస్యల పరిష్కారంపై చర్చ! - TRUMP XI HOLD TELEPHONE TALKS

జిన్‌పింగ్‌కు ఫోన్​ చేసిన ట్రంప్‌ - వాణిజ్యం, ఫెంటానిల్‌, టిక్‌టాక్‌ అంశాలపై చర్చ - ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని నిర్ణయం!

Trump Xi
Trump Xi (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2025, 10:33 PM IST

Trump Xi Hold Telephone Talks : అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఫోన్‌ చేశారు. 'వాణిజ్యం, ఫెంటానిల్‌, టిక్‌టాక్‌ మొదలైన అంశాలపై చర్చించామన్న ట్రంప్​, ప్రపంచ శాంతికోసం కలిసి పనిచేద్దామని జిన్​పింగ్​కు సూచించినట్లు చెప్పారు.

"చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో ఫోన్​లో మాట్లాడాను. ఈ సంభాషణ ఇరు దేశాలకు ముఖ్యమైనది. మేం కలిసి అనేక సమస్యలను పరిష్కరించాలని, వాటిని వెంటనే మొదలుపెట్టాలని ఆశిస్తున్నా. వాణిజ్యం, ఫెంటానిల్‌, టిక్‌టాక్‌ సహా అనేక అంశాలపై చర్చించాం. ప్రపంచ శాంతి కోసం ఇరువురం కలిసి సాధ్యమైనంత మేరకు కృషి చేస్తాం" అని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

జనవరి 20న జరిగే ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకావడం లేదని చైనా ఇది వరకే పేర్కొంది. తమ ప్రతినిధిగా వైస్‌ ప్రెసిడెంట్‌ హాన్‌ జెంగ్‌ను పంపిచనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరగుపరచుకునేందుకు అవసరమైన సంప్రదింపులు, సహకారం కోసం అమెరికా నూతన ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.