Daaku Maharaj Success Meet : నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో మంచి సక్సెస్ అందుకున్నారు. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో మూవీటీమ్ హైదరాబాద్‌లో శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో హీరో బాలయ్య సహా, చిత్ర యూనిట్ పాల్గొంది.
అయితే సినిమాలో ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు ఫుల్ క్రేజ్ వస్తోంది. తమన్ అందించిన సంగీతానికి బాలయ్య అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దీంతో తమన్‌ను 'నందమూరి తమన్' అంటూ సోషల్ మీడియాలో సరదగా పిలుస్తున్నారు. అయితే దీనిపై సక్సెస్‌మీట్‌లో బాలయ్య స్పందించారు. ఇంతటి అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్‌ను ఆయన కూడా ప్రశంసించారు.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్ 'నందమూరి తమన్' అని పిలవడంపై ఆయన స్పందిస్తూ, మ్యూజిక్ డైరెక్టర్‌కు కొత్త పేరు పెట్టారు. 'తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ అతని ఇంటి పేరు మార్చేశారు. ఎస్ ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని అంటున్నారు. కానీ, నందమూరి కూడా కాదు. ఈరోజు నుంచి ఇతడు 'NBK తమన్'. అని నామకరణం చేస్తున్నా (నవ్వుతూ)' అని అన్నారు. ఇక ఇదే ఈవెంట్లో బాలయ్య మూవీటీమ్ అందరినీ ప్రశంసించారు.
సినిమాను చంపకండి
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఈవెంట్లో కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నెగెటివ్ ట్రోల్స్‌తో సినిమాను చంపేయోద్దని అన్నారు. 'ఒక నిర్మాత ఎంతో కష్టపడి సినిమా చేస్తారు. సినిమాకు ఇంపార్టెంట్ వాళ్లే. ఇవాళ తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లిపోయింది. కానీ, కొందమంది నెగెటివ్ ట్రోల్స్ చేస్తు మనమే సినిమాను చంపేసుకుంటున్నాం' అని తమన్ అన్నారు.
కాగా, ఈ సినిమా ఇప్పటికే రూ.100 క్లోబ్లో చేరిపోయింది. ఈ వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో కలిసి ఆడిపాడారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు.
The BOX OFFICE is on fire 🔥
— Sithara Entertainments (@SitharaEnts) January 17, 2025
and the CELEBRATIONS grow higher and higher ❤️
Moments from the #DaakuMaharaaj Success Press Meet with the powerhouse team! 😍🫶🏻#BlockbusterHuntingDaakuMaharaaj 🦁
𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby @MusicThaman… pic.twitter.com/cQ8fw3SAfs
'డాకు మహారాజ్' కాసుల వర్షం- 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి
బాలయ్య కెరీర్లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్- 'డాకు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?