Rohit Sharma Net Practice : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్లోమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసీస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన హిట్‌మ్యాన్, కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు డొమెస్టిక్ టోర్నీలో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబయి వాంఖడే స్టేడియం నెట్స్‌లో ప్రాక్టీస్ బ్యాటింగ్ చేశాడు. నెట్స్‌తో రోహిత్ తీవ్రంగా చెమటోడ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను హిట్‌మ్యాన్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
నెట్స్‌లో రోహిత్
ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కవర్ షాట్లు, కట్ షాట్లు, పుల్ షాట్లు, కవర్ డ్రైవ్ తదితర షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. అలాగే హిట్ షాట్లు, భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. అదే విధంగా ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ఫుట్ వర్క్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాడు. కాగా, రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడ టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సైతం ఉన్నాడు.
బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ కఠినమైన షాట్లు ఆడాడు. డ్రైవ్‌ల నుంచి కట్స్ అండ్ పుల్స్ వరకు అన్నీంటినీ రోహిత్ సాధన చేశాడు. రోహిత్ టైమింగ్ అద్భుతంగా అనిపించింది. అతడి ప్రతి షాట్ సక్సెస్ అయింది. రోహిత్ ప్రాక్టీస్ వీడియోను చూసి మళ్లీ అతడు పాత ఫామ్ తిరిగి అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే సిరీస్
ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న రెండో వన్డే, మూడో వన్డే ఫిబ్రవరి 12న జరగనుంది. ఈ వన్డే సిరీస్ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ సిరీస్‌లో రాణించి, అదే ఫామ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించాలని రోహిత్ తీవ్రంగా సాధన చేస్తున్నాడు.
చాలా కీలకం
ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో రోహిత్ ఫామ్‌లోకి రావడం టీమ్ఇండియాకు చాలా కీలకం. ఎందుకంటే ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్ తర్వాత వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలో బారత్ ఆడనుంది. ఆ ట్రోఫీలో రోహిల్ లాంటి బ్యాటర్లు రాణించడం టీమ్ఇండియాకు చాలా కీలకమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రోహిత్, విరాట్ చూపు రంజీ వైపు- కుర్రాళ్లుకూడా ఈ రూటు లోనే!
ఏంటీ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్తున్నాడా?- ఇదేం ట్విస్ట్ భయ్యా!