Rohit Sharma India Vs Bangladesh 2nd Test :కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో రోహిత్ శర్మ కీలక డెసిషన్ తీసుకున్నాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారి మ్యాచ్ మొదలయ్యేందుకు కాస్త సమయం పట్టింది. దీంతో టాస్ నెగ్గిన తర్వాత రోహిత్ బౌలింగ్ ఎంచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
సాధారణంగా స్వదేశంలో జరిగే మ్యాచుల్లో ఎక్కువగా టాస్ గెలిచితే టీమ్‌ఇండియా కెప్టెన్లు బౌలింగ్‌ను తీసుకోవడం చాలా అరుదు. కానీ, రోహిత్ 9 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే కాన్పూర్ స్టేడియంలో ఇదే డెసిషన్‌ను 60 ఏళ్ల క్రితం తొలిసారి తీసుకున్నారు. అప్పటి కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ ఈ నిర్ణయం తీసుకుని హౌం గ్రౌండ్లో తొలిసారి బౌలింగ్ చేశారు. అయితే ఆ మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది.
ఇదిలా ఉండగా, గతంలోనూ టీమ్ఇండియా కెప్టెన్లు టెస్ట్ క్రికెట్లో బౌలింగ్‌ను ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి. 2015లో విరాట్ కోహ్లీ ఇలానే సౌతాఫ్రికాపై తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు రోహిత్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడం గమనార్హం. మరి ఇప్పుడు ఈ రెండో టెస్టు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.