Jos Buttler About BCCI Rules : గత మ్యాచ్‌ల ఫలితాల దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియాను మెరుగుపరిచేందుకు బీసీసీఐ తాజాగా నయా రూల్స్‌ను తీసుకొచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాటిని త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమైంది. 10 పాయింట్లతో కూడిన రూల్స్ పట్టికను సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లకు బీసీసీఐ పంపించింది. వాటిని బ్రేక్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్లో తప్పనిసరిగా ఆడటం ఈ కొత్త రూల్స్‌లో మెయిన్ది కాగా, విదేశాల్లో పర్యటనల సమయంలో క్రికెటర్ల వెంట ఫ్యామిలీ మెంబర్స్ రావడంపై లిమిట్స్ పెట్టడం మరో రూల్. లాంగ్ టూర్లో వైఫ్, పిల్లలు రెండు వారాలు మాత్రమే ఉండొచ్చుని, చిన్న సిరీస్‌లో మాత్రం కేవలం వారం రోజులు మాత్రమే వారు ఉండేందుకు పర్మిషన్ ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల ప్రయాణం గురించి సెక్రటరీతో మాట్లాడాలని, ప్లేయర్లు తనను అడుగుతున్నారంటూ కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సందర్భంగా అన్నాడు.
ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 22న ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)లో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమెలో టీ20, వన్డే సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్‌పై స్పందించాడు. అంతర్జాతీయ పర్యటనల సమయంలో ప్లేయర్లకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం ఎంతో ఇంపార్టెంట్ అని పేర్కొన్నాడు.
"ఇది (క్రికెటర్ల వెంట కుటుంబ సభ్యులు రావడం) ఎంతో ముఖ్యమైన విషయమని నేను భావిస్తున్నాను. మనం ఇప్పుడు మోడ్రన్ వరల్డ్‌లో జీవిస్తున్నాం. విదేశీ పర్యటనల్లో క్రికెటర్లు తమ ఫ్యామిలీలతో కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఆ సమయాన్ని మనం ఆస్వాదించాలి. ఎందుకంటే ఎన్నో సార్లు ప్లేయర్లు తీరిక లేని షెడ్యూల్‌తో ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉంటారు. ఇది (కుటుంబ సభ్యులు వెంట రావడం) అనేది క్రికెట్‌పై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని నేనైతే అస్సలు అనుకోను. దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం ప్రకారం ప్లేయర్లు ఇంటికి దూరంగా ఉన్నామనే ఫీలింగ్ కలగకుండా ఉండాలంటే వారి వెంట ఫ్యామిలీ రావటం చాలా ముఖ్యం. ఇది వారిని ఎమోషనల్‌గా, మానసికంగా బలంగా ఉంచుతుందని నా భావన" అని బట్లర్ పేర్కొన్నాడు.
'క్రికెట్లోనూ రాజకీయాలు!'- BCCIపై PCB ఆరోపణలు- రోహిత్ కోసమే అదంతా!
'ఇది స్కూల్ అనుకుంటున్నారా?'- BCCI నయా రూల్స్‌పై రోహిత్, అగార్కర్ రియాక్షన్