MS Dhoni Vs Usain Bolt : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఫిట్నెస్తో బ్యాటింగ్, కీపింగ్ సమయంలో చిరుతలా పరుగెడుతుంటాడు. అందుకే ధోనీ కీపర్‌గా బ్యాటర్లు క్రీజు బయట కాలు పెట్టాలన్నా, దగ్గర్లో బాల్ ఉన్నప్పుడూ రన్ తీయాలన్నా భయపడేవారు. అంతలా ధోనీ కీపింగ్‌లో రాణించాడు.
అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2016లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. టీమ్ ఇండియా, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో భారత మాజీ కెప్టెన్ ధోనీ తన అసాధారణ వేగంతో పరుగెత్తి బ్యాటర్‌ను రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ భారత్ వశమైంది.
అసలేం జరిగిందంటే?
ఆ మ్యాచ్‌లో బంగ్లా విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం. భారత బౌలర్ హార్దిక్ పాండ్య వేసిన బంతి షాట్ మిస్ ధోనీ చేతికి వెళ్లింది. అటువంటి సమయంలో ధోనీ వేగంగా కదిలి బంగ్లా బ్యాటర్ ముస్తాఫిజర్ రెహమాన్‌ను ఔట్ చేశాడు. అందుకోసం తన గ్లవ్‌ను ఒకదాన్ని పక్కన పెట్టాడు. బ్యాటర్‌కు ధీటుగా కదిలి అతను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ టై కాకుండా టీమ్ ఇండియా విజయం సాధించింది.
2 సెకన్లలో 13 మీటర్ల పరుగు
అప్పుడు ధోనీ 13 మీటర్ల దూరాన్ని దాదాపు 2 సెకన్లలో పూర్తి చేశాడు. జమైకా పరుగుల వీరుడు, ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌తో సమానంగా ధోనీ పరుగు తీసినట్లు లెక్కన్నమాట. అంత వేగంగా ధోనీ కీపింగ్ ప్లేస్ నుంచి వికెట్లు వైపు పరుగెత్తాడు. అయితే ధోనీ, ఉసేన్ బోల్ట్ రన్నింగ్ చేసిన సందర్భం వేరైనా వారిద్దరూ పరుగు తీయడంలో ఉద్దండులే అని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. కాకపోతే బోల్ట్ సుదూర దూరానికి ఫాస్ట్‌గా రన్నింగ్ చేయడంలో దిట్ట. ధోనీ కేవలం 13 మీటర్ల దూరంలో వేగంగా పరుగెత్తి రనౌట్ చేశాడు. అందుకే ఈ ఇద్దర్ని సరిపోల్చడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు.
కాగా, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించాడు. అతడి కెప్టెన్సీలోనే భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే టీమ్ఇండియాను టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానంలో నిలబెట్టింది కూడా ధోనీయే కావడం విశేషం. అంతలా భారత క్రికెట్లో ధోనీ చెరగని ముద్ర వేశాడు. ఐపీఎల్‌లోనూ ధోనీ సత్తా చాటాడు. తాను ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
ధోనీ ఫ్యామిలీ టైమ్- పెంపుడు శునకంతో అలా- వీడియో వైరల్
'మంచి క్రికెట్ ఆడితే, ఎలాంటి ప్రమోషన్స్ అక్కర్లేదు'- సోషల్ మీడియాపై ధోనీ