ETV Bharat / sports

క్రికెట్ లవర్స్​కు బంపర్​ ఆఫర్- ఆ రోజంతా మెట్రో ఫ్రీ- మ్యాచ్ టికెట్ ఉంటే చాలు! - IND VS ENG T20 SERIES

చెన్నై వేదికగా రెండో టీ20 - క్రికెట్ లవర్స్​కు తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ బంపర్ ఆఫర్ - మ్యాచ్ టికెట్ ఉంటే చాలు!

Ind Vs Eng T20 Series
Ind Vs Eng T20 Series (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 22, 2025, 9:23 AM IST

Ind Vs Eng T20 Series : ఆస్ట్రేలియా సిరీస్​లో ఘోర పరాజయాన్ని చవి చూసిన టీమ్ఇండియా బుధవారం నుంచి ఇంగ్లాండ్​తో ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్​లో రెండో మ్యాచ్‌ శనివారం జరగనుంది. ఈ క్రమంలో క్రీడాభిమానుల కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం కల్పించనున్నట్లు తాజాగా వెల్లడించింది.

టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు వినియోగించుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రెండో టీ20 కోసం టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. 2023 ఐపీఎల్‌ సీజన్‌లోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్‌లకు ఇలానే మెట్రో సేవలను ఉచితంగా అందించింది. చెపాక్‌ చుట్టుపక్కల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఇలాంటి వెసులుబాటు కల్పించింది.

"మ్యాచ్‌ టికెట్లు ఉన్న ప్రేక్షకులు మెట్రో రైళ్లలో ఆ రోజున ఉచితంగా ప్రయాణాలు చేయొచ్చు. చెపాక్‌కు వచ్చేందుకు మీ ట్రావెల్‌ను ప్లాన్‌ చేసుకోండి" అని సోషల్ మీడియా వేదికగా తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ వెల్లడించింది.

గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా చెన్నైలో అంతర్జాతీయ మ్యాచ్​కు వేదికైంది. అప్పుడు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో భారత్ పోటీ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ పొట్టి కప్​ కోసం వల్ల తమిళనాడులోకి అడుగుపెట్టింది టీమ్ఇండియా. అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అటు వీకెండ్‌ కావడం కూడా టికెట్లు త్వరగా అయిపోవడానికి ఓ కారణమంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈడెన్‌ గార్డెన్స్‌లో ఫుల్ ప్రాక్టీస్
మరోవైపు ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సిరీస్‌ కావడం వల్ల దీనిపై క్రీడాభిమానులకు ఆసక్తి నెలకొంది. గాయం నుంచి కోలుకున్న షమీ మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. దీంతో అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. తను ఎలా బౌలింగ్‌ చేస్తాడనేది చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే దేశవాళీ టోర్నీల్లో చెలరేగిపోయిన షమీ, తిరిగి ఫామ్​లో వచ్చినట్లు అందరికీ నిరూపించాడు.

అయితే న్యూజిలాండ్, ఆసీస్‌ చేతిలో వరుసగా టెస్టు సిరీస్‌ల్లో ఓటమి చవి చూసిన భారత జట్టు దాని నుంచి బయటపడాలంటే ఇంగ్లాండ్​తో పొట్టి సిరీస్‌ను గెలవాల్సిన అవసరం ఎంతో ఉంది. సూర్యకుమార్‌ నాయకత్వంలో ఇప్పటికే ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టీమ్‌ఇండియా ఘోరంగా ప్రాక్టీస్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'నువ్వు సూపర్ రోహిత్, ఇందుకే నువ్వంటే మాకిష్టం'- కెప్టెన్​పై నెటిజన్ల ప్రశంసలు

'నా పెద్ద కొడుకును అలానే చేశారు- ఇప్పుడు శాంసన్​ను కూడా!' : KCAపై సంజు తండ్రి ఫైర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.