Rohan Bopanna Australia Open : భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తాజాగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో తన సహచరుడు ఎబ్డెన్‌తో కలిసి ఫైనల్‌లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై విజయాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను బోపన్న తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్‌లో 7-6 (7/0), 7-5 తేడాతో వరుస సెట్లలో రోహన్ జోడీ విజయం సాధించింది. అలా 43 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మ్యాచ్ ఎలా సాగిందంటే ?
Australia Open Mixed Double 2024 : ఫైనల్‌లో సిమోన్ - వావాసోరి జోడీ నుంచి రోహన్ - ఎబ్డెన్‌కు గట్టి పోటీ ఎదురైంది. తొలి పాయింట్ నుంచి ఇరు టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెట్‌ను 7-6 (7/0)తో రోహన్ జోడీ తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే రెండో సెట్ కాస్త మరింత రసవత్తరంగా సాగింది. ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా? అంటూ గెలుపు కోసం తీవ్రంగా పోరాడారు. ఒకానొక సమయంలో రోహన్ బోపన్న జోడీ 3-4తో వెనకబడింది. అయినప్పటికీ క్రమక్రమంగా వేగం పుంజుకుని దూసుకెళ్లింది. దీంతో మ్యాచ్ రిజల్ట్ మూడో సెట్‌కు వెళ్తుందా? అనే అనుమానం సైతం వీక్షకులకు వచ్చింది. కానీ, రోహన్ - ఎబ్డెన్ జోడీ అదరగొట్టేసింది. రెండో సెట్‌ను 7-5 తేడాతో నెగ్గి, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.