Sixes In Bumrah Bowling Test : టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అతడు సంధించే యార్కర్లకు వికెట్ కోల్పోకుండా చాలా మంది బ్యాటర్లు జాగ్రత్త పడుతుంటారు. అంతలా ఇటీవల కాలంలో బుమ్రా తన బౌలింగ్‌తో విజృంభిస్తున్నాడు. అయితే బాక్సింగ్ డే టెస్టులో 19ఏళ్ల ఆసీస్ కుర్రాడు బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ బాది అందర్నీ ఆశ్చర్యపర్చాడు.
టెస్టు ఫార్మాట్లో దాదాపు 4483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ రావడం అదే తొలిసారి కావడం గమనార్హం. అయితే తన 6ఏళ్ల టెస్టు కెరీర్లో బుమ్రా ఇప్పటివరకు 44 మ్యాచ్‌ల్లో 8570 బంతులు సంధించాడు. అందుకే కేవలం తొమ్మిదిసార్లే బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది. మరి సింగిల్ తీయడమే కష్టంగా ఉండే బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌లు బాదింది ఎవరు? ఎప్పుడు బాదారో తెలుసుకుందాం!
- టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఆదిల్ రషీద్ 2018లో సిక్సర్ బాదాడు. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టాడు.
- సౌంతాప్టన్ వేదికగా 2018లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ బుమ్రా ఓవర్లో సిక్సర్ బాదాడు.
- 2018లో ది ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ రెండు సిక్సర్లు కొట్టాడు.
- 2018లో కేప్ టౌన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీయర్స్ సిక్స్ కొట్టాడు.
- మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 2020 జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు నాథన్ లియాన్ కూడా బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు.
- 2021లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు కెమెరాన్ గ్రీన్ సిక్స్ కొట్టాడు.
- అలాగే తాజాగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ కాన్ స్టాస్ అదరగొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా బౌలింగ్‌లో మూడేళ్ల తర్వాత సిక్సర్ నమోదైంది.
అదరగొడుతున్న బుమ్రా
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ ల్లో 30 వికెట్లు తీసి ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇక 2024లో మొత్తం 13 టెస్టుల్లో బుమ్రా 71 వికెట్లు పడగొట్టాడు.
Accounts got Settled 😉
— Richard Kettleborough (@RichKettle07) December 29, 2024
- Sam Konstas smashed Bumrah in 1st Innings 👏🏻 But got rattled in 2nd Innings by Great Jasprit Bumrah 🔥
Bumrah 1️⃣- 1️⃣ Konstas (Waiting for Sydney Test for Final Showdown)#INDvAUSpic.twitter.com/K7W0GvZ6WT
బుమ్రా@ 200- తొలి భారత బౌలర్‌గా రికార్డ్- కెరీర్లో మరో ఘనత
'కమాన్, ఇప్పుడు అరవండి రా!'- కొన్‌స్టాస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా సంబరాలు