ETV Bharat / sports

రసవత్తరంగా WTC ఫైనల్ రేస్- భారత్​కు ఇలా కూడా ఛాన్స్ ఉంది! - WTC INDIA CHANCES

WTC ఫైనల్​ రేసు- టీమ్ఇండియా అవకాశాలు ఇలా!

WTC India Chances
WTC India Chances (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 30, 2024, 3:13 PM IST

WTC India Chances : 2025 వరల్డ్​టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్‌ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరగా, రెండో స్థానం కోసం ఆయా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరాలన్న టీమ్‌ఇండియా ఆశలు ఆవిరవుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు ఓటమితో భారత్ ఫైనల్‌ అవకాశాలు పూర్తిగా సంకిష్టంగా మారాయి.

  • ఆస్ట్రేలియాకు తాజా విజయంతో ఫైనల్‌ చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ప్రస్తుతం ఆసీస్ 61.46 పాయింట్ పర్సెంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
  • ప్రస్తుత డబ్ల్యూటీసీ ఈ సైకిల్‌లో భారత్‌ ఆడాల్సింది ఇంకో మ్యాచ్‌ మాత్రమే. బాక్సింగ్‌ డే టెస్టులో ఓటమితో ఫైనల్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. టీమ్ఇండియా ప్రస్తుతం 52.78 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టులో గెలిచినా, టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.
  • కొత్త సంవత్సరంలో ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో శ్రీలంకతో ఆసీస్​ రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ఆసీస్‌ 0- 2 తో ఓడితే, భారత్​కు ఛాన్స్ ఉంటుంది. అప్పుడు భారత్‌ ఖాతాలో 55.26 పర్సెంటేజీ ఉంటుంది. ఆస్ట్రేలియా 53.51 శాతానికి పడిపోతుంది. ఇక శ్రీలంక 53.85 శాతం వద్దే నిలిచిపోతుంది. అయితే ఆస్ట్రేలియాపై భారత్‌ ఆఖరి టెస్టులో గెలిస్తేనే ఈ సమీకరణాలు ముందుకొస్తాయి.
  • ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా అయితే, అప్పుడు మెరుగైన స్థానంలో ఉన్న జట్టు టాప్‌ 2 లోకి చేరుతుంది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టులో భారత్‌ నెగ్గినప్పటికీ, శ్రీలంకతో సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా, టీమ్‌ఇండియా అవకాశాలు గల్లంతే.
  • బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో చివరి టెస్టులో భారత్‌ ఓడినా, మ్యాచ్​ను డ్రా గా ముగించినా అధికారికంగా ఫైనల్‌ రేసు నుంచి టీమ్‌ఇండియా నిష్క్రమిస్తుంది.

సఫారీలదే తొలి అడుగు
పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఆ జట్టు 66.67 శాతంతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. దీంతో సఫారీలు తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడబోతున్నారు. ఇక ఫైనల్‌కు చేరే ఆ రెండో జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి- WTC ఆశలు ఖతం?

గబ్బాలో గట్టెక్కాం- మరి భారత్ WTC ఫైనల్ సంగతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.