Ravichandran Ashwin About Retirement :టీమ్ఇండియా ఆస్ట్రేలియా టూర్లో ఉన్న సమయంలో ఆ జట్టు సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ పలికి అందరికీ షాకిచ్చాడు. అయితే అతడికి అవమానం జరగడం వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను నెట్టింట వెల్లడించారు. అయితే ఫేర్‌వెల్ టెస్టు కూడా ఆడే అవకాశమైనా ఇస్తే బాగుండేదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా వీటన్నింటిపై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. బయట అనుకొనేవన్నీ నిజాలు కాదని, ప్రస్తుత రోజుల్లో ఫ్యాన్ వార్ అనేది ఓ రేంజ్లో ఉందని వ్యాఖ్యానించాడు.
"నేను బ్రేక్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అందుకే, ఈ సిరీస్ మధ్యలోనే బయటకి వచ్చేశాను. అయితే క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకున్నాను. అందుకే, మెల్‌బోర్న్‌తో పాటు సిడ్నీ టెస్టుల తర్వాత కొన్ని విషయాల గురించి పోస్ట్‌లు చేశాను. అప్పుడు కూడా రిటైర్మెంట్ గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు నేను గౌరవించాలి. కానీ బయట ఫ్యాన్ వార్ మాత్రం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలు కూడా నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. నేను రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన సమయంలో నా క్రియేటివిటీని కోల్పోయానని భావించాను. కానీ క్రికెట్‌లో కొన్నిసార్లు ఇటువంటి కామనే. ఇన్నింగ్స్‌ను ముగించడం కూడా సంతోషంగానూ ఉంటుంది. అంతకంటే ఇంకో కారణం లేదు" అని అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.
ఫేర్‌వెల్ మ్యాచ్ గురించి ఏమన్నాడంటే?
ఇదిలా ఉండగా, ఇదే వీడియోలో ఫేర్‌వెల్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. వ్యక్తిగతంగా ఇటువంటి ఫేర్‌వెల్ మ్యాచ్‌లకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వనని అదేమంత ముఖ్యమైంది కూడా కాదని పేర్కొన్నాడు.