Dhoni Lady Fans : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వరల్డ్‌వైడ్‌గా ధోనీకి ఫుల్ క్రేజ్ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోనీ ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఫ్యాన్స్ అతడిని చుట్టేస్తారు.
ఇక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు ధోనీని 'మహీ' అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే లేడీ ఫ్యాన్స్ తన చుట్టూ చేరినప్పుడు ధోనీ ఏం చేస్తాడు? ముఖ్యంగా భార్య సాక్షి సింగ్ తన పక్కనే ఉంటే, వాళ్లను ఎలా డీల్ చేస్తాడు? అసం ఆ టైమ్‌లో ధోనీకి ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర ప్రశ్నలకు ధోనీయే సమాధానం చెప్పాడు.
ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన ధోనీకి 'మీ చుట్టు లేడీ ఫ్యాన్స్ ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీ భార్య పక్కనే ఉండాలని మీరు అనుకుంటారా?' అనే ప్రశ్న ధోనికి ఎదురైంది. దీనికి ధోనీ స్పందించాడు. 'తను (సాక్షి) ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటుంది. ఒకవేళ ఆమె నా పక్కన లేకపోయినప్పటికీ, తను నాతోనే ఉన్నట్లు భావిస్తా. అదే మంచిది కూడా. నేను సేఫ్‌గా ఉండాలంటే అలా అనుకోవడమే బెటర్' అని ఫన్నీగా రెస్పాన్స్ ఇచ్చాడు.
ఐపీఎల్‌కు సిద్ధం
ఇక ధోనీ 2025 ఐపీఎల్ బరిలో దిగనున్నాడు. ఈ సీజన్ కోసం త్వరలోనే ప్రాక్టీస్ కూడా ప్రారంభించే ఛాన్స్ ఉంది. 43ఏళ్ల ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది.