ETV Bharat / technology

ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ రేసులోకి నథింగ్!- కిర్రాక్ ఏఐ ఫీచర్లతో 'నథింగ్ ఫోన్ 3' దింపేందుకు రెడీ? - NOTHING PHONE 3 LAUNCH TIMELINE

త్వరలో మార్కెట్లోకి 'నథింగ్ ఫోన్ 3'!- లాంఛ్​కు ముందే స్పెక్స్ లీక్- ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే?

Nothing Phone 2
Nothing Phone 2 (Photo Credit- Nothing)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 6:30 PM IST

Nothing Phone 3 Expected Launch Timeline: ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ నథింగ్ తన అప్​కమింగ్ నథింగ్ ఫోన్ (3) లాంఛ్​తో ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్ రేసులో చేరనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్​కు ముందే ఈ స్మార్ట్​ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరపై అనేక లీక్స్​ వచ్చాయి. కంపెనీ కో-ఫౌండర్ కార్ల్ పీ ఈ సమాచారాన్ని నథింగ్ ఉద్యోగులకు పంపినట్లు ప్రచారం అవుతున్న లీక్​ అయిన ఇమెయిల్ స్మార్ట్​ఫోన్ లాంఛ్ టైమ్​లైన్​ను వెల్లడిస్తుంది.

టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ఆ ఇమెయిల్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో షేర్​ చేశారు. అందులో 'Biggest Year Ever', 'Nothing's year of Innovation' అని పేర్కొంటూ 2025లో కంపెనీ ప్లాన్స్​ గురించి పంచుకున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్డర్​లో ఈ అప్​కమింగ్ నథింగ్ ఫోన్ (3) లాంఛ్ చేయనున్నట్లు కూడా ఆ పోస్ట్​ ద్వారా కన్ఫార్మ్ చేశారు. అంటే మార్చి 2025 నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.

ఆ ఇమెయిల్ స్క్రీన్ షాట్​లో అప్​కమింగ్ నథింగ్ ఫోన్ (3)ను 'ప్రపంచం చూసేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్న చారిత్రాత్మక స్మార్ట్​ఫోన్​ లాంఛ్​'గా వర్ణిస్తూ ఉంది. ఈ ఇమెయిల్ నథింగ్ ఫోన్ (3) గురించి పెద్దగా వివరాలను వెల్లడించనప్పటికీ, యూజర్ ఇంటర్‌ఫేస్ పరంగా విప్లవాత్మక ఆవిష్కరణలకు దారితీసే AI-ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను అందించే దిశగా నథింగ్ కంపెనీ ఫస్ట్ స్టెప్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

నథింగ్ ఫోన్ (3) స్పెసిఫికేషన్లు: ఈ స్మార్ట్​ఫోన్​పై లీక్​ అయిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ (3) 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది HDR10+ సపోర్ట్​తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్​లో క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 8 Gen 3 చిప్‌సెట్​ ఉండొచ్చు. ఈ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC ద్వారా ఆధారితమైన ప్రీమియం డివైజ్​ల కంటే ఒక జనరేషన్ పాతది అయినప్పటికీ, నిజానికి ఇది ఒక ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్.

ఈ ఫోన్‌లో 12GB RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్​తో వస్తుంది. ఈ కొత్త ఫోన్ NothingOS 3.0 పై నడుస్తుందని, ఇందులో అనేక AI-రిలేటెడ్ ఫీచర్లు ఉంటాయని సమాచారం.

కంపెనీ ఈ ఫోన్​ను దాని బ్రాండ్ సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో పాటు వెనుకవైపు కస్టమైజబుల్ LED లైట్ స్ట్రిప్స్​తో తీసుకొస్తుంది. ఇది యాపిల్ లేటెస్ట్ ఐఫోన్‌లలో కనిపించే మాదిరిగానే కొత్త యాక్షన్ బటన్‌ను కూడా కలిగి ఉండొచ్చు. అయితే ఈ స్మార్ట్​ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లపై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి లీక్స్​ అందుబాటులోకి రాలేదు. కానీ దీని ధర దాదాపు రూ.50,000 ఉంటుందని అంచనా.

చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్- సిరి, అలెక్సాకు పోటీగా రంగంలోకి 'Tasks'!

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు- రూ. 64,499కే కొనుగోలు చేయొచ్చు!- ఎక్కడంటే?

ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70-80 కి.మీ ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.