ETV Bharat / entertainment

'సంక్రాంతికి వస్తున్నాం'పై మహేశ్ రివ్యూ- డైరెక్టర్​ను అలా అనేశాడేంటి? - SANKRANTHIKI VASTHUNAM

సంక్రాంతికి వస్తున్నాంపై మహేశ్ రియాక్షన్- ఏమన్నారంటే?

Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 6:54 PM IST

Mahesh Babu On Sankranthiki Vasthunam : విక్టరీ వెంకటేశ్‌- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా 'సంక్రాతికి వస్తున్నాం'. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్​లో రూపొందిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో హౌస్​ఫుల్ షోస్​తో రన్ అవుతోంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై తన రివ్యూ చెప్పారు. ఇది సరైన సంక్రాంతి సినిమా అని అన్నారు. మూవీటీమ్​కు శుభాకాంక్షలు చెప్పారు.

'సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చాలా ఎంజాయ్ చేశాను. ఇది అసలైన పండగ సినిమా. వెంకటేశ్ సర్ అద్భుతంగా నటించారు. వరుస విజయాలు అందుకుంటున్న నా డైరెక్టర్ అనిల్ రావిపూడి పట్ల గర్వంగా ఉన్నా. ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షీ చౌదరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతం' అని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. అయితే దర్శకుడు అనిల్​ను నా డైరెక్టర్ అనడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆయనను ఆప్యాయంగా అలా పిలవడంపై సోషల్ మీడియాలో మహేశ్​పై ప్రశంసలు కురుస్తున్నాయి. చూడాలి మరి దీనికి దర్శకుడు అనిల్ ఎలా రియాక్ట్ అవుతారో?

ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడం వల్ల తొలి రోజు థియేటర్లు హౌస్​ఫుల్​గా రన్ అయ్యాయి. ఓపెనింగ్ డే ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.45 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. కాగా, వెంకటేశ్ కెరీర్​లో ఇదే హైయ్యెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.

100 మిలియన్
దాదాపు 18ఏళ్ల తర్వాత 'గోదారి గట్టుమీద' అంటూ సింగర్ రమణ గోగుల తన స్వరం వినిపించారు. ఆయన వాయిస్​తో ఈ పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. రిలీజైనప్పటి నుంచి ఈ పాట దుమ్మురేపుతోంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటేసింది

కాగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, నరేశ్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వి రాజ్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. భీమ్స్​ సిసిరొలియో సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు నిర్మించారు.

'సంక్రాంతికి వస్తున్నాం' ఓపెనింగ్స్- వెంకీ మామ కెరీర్​లోనే ఆల్​టైమ్​ హైయ్యెస్ట్​!

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రివ్వూ : వెంకీ మామ ఖాతాలో హిట్‌ పడిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.