Revanth Reddy in Delhi : ఆర్‌ఎస్‌ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తూ బీఆర్‌ఎస్ పార్టీ బీ ఆర్‌ఎస్‌ఎస్‌గా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 40 ఏళ్లుగా సొంత కార్యాలయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశానికి సేవలందించిందని తెలిపారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారత్‌ను తయారు చేసేందుకు, భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసే వేదికగా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఉంటుందని రేవంత్‌రెడ్డి వివరించారు.
బీఆర్‌ఎస్ ఆఫీస్‌లపై దాడులు? : బీఆర్‌ఎస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా ఎవరిపైనా దాడి జరిగితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రంలోని బీఆర్‌ఎస్ తరహాలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మీరు ఎక్కడికైనా వెళ్లి చూడండి. శాంతిభద్రతల సమస్య వస్తే తక్షణం జోక్యం చేసుకుని పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారని, గత ప్రభుత్వం (బీఆర్‌ఎస్) ఆ పని చేసి ఉండాల్సిందని ఈ సందర్భంగా మీడియాతో అన్నారు.
"పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు. బీఆర్‌ఎస్ అంటే బీఆర్‌ఎస్‌ఎస్ అదే విధానాలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై బీజేపీ ఎలాంటి ఆరోపణలు చేస్తే తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ అదేపని చేస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చట్టాన్నిసమర్థంగా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. తెలంగాణలోనూ ఇదే జరుగుతోంది" -రేవంత్ రెడ్డి
పార్టీతో సంబంధం లేదు - ఎవరి సలహాలనైనా స్వీకరిస్తా : సీఎం రేవంత్ రెడ్డి