IND W vs IRE W 3rd ODI : భారత మహిళల జట్టు వన్డే హిస్టరీలో రికార్డు స్థాయి స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (154 పరుగులు; 129 బంతుల్లో; 20x4, 1x6), స్మృతి మంధాన (135 పరుగులు; 80 బంతుల్లో; 12x4, 7x6) సెంచరీల మోత మోగించారు. రితా ఘోష్ (59 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ, ఫ్రెయా, జార్జియానా తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇక వన్డే చరిత్రలో భారత్ మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ కాగా, ఓవరాల్‌గా ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2018లో డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌పై కివీస్ మహిళల జట్టు 491-4 స్కోర్ నమోదు చేసింది. మహిళల వన్డే హిస్టరీలో ఇదే అత్యధిక స్కోర్.
Innings Break!
— BCCI Women (@BCCIWomen) January 15, 2025
A 𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 batting display from #TeamIndia in Rajkot! 🙌 🙌
Hundreds for Pratika Rawal & captain Smriti Mandhana 👏
Target 🎯 for Ireland - 436
Updates ▶️ https://t.co/xOe6thhPiL#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/aid00lGDjY
మహిళల వన్డేల్లో అత్యధిక స్కోర్లు
- 491/4 - న్యూజిలాండ్ vs ఐర్లాండ్ - 2018
- 455/5 - న్యూజిలాండ్ vs పాకిస్థాన్ - 1997
- 440/3 - న్యూజిలాండ్ vs ఐర్లాండ్ - 2018
- 435/5 - భారత్ vs ఐర్లాండ్ - 2025
- 418/10 - న్యూజిలాండ్ vs ఐర్లాండ్ - 2018
బౌండరీల వర్షం
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా మొదటి ఓవర్ నుంచే బాదడం ప్రారంభించింది. ఓపెనర్లు స్మృతి, ప్రతీక బౌలరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్ల దూకుడుకు 12 ఓవర్లలోనే జట్టు స్కోర్ 100 దాటింది. స్మృతి- ప్రతీక జోడీ జోరుకు ఐర్లాండ్ బౌలింగ్ తేలిపోయింది. ఈ క్రమంలోనే స్మృతి 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గానూ రికార్డు సాధించింది.
సెంచరీ తర్వాత దూకుడుగా ఆడిన స్మృతి క్యాచౌట్‌గా పెలియన్ చేరింది. దీంతో 233 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఈ జోడీ జోడీ కేవలం 26.4 ఓవర్లలోనే 233 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాక కూడా జోరు పెంచింది. ఈ క్రమంలోనే కెరీర్లో తొలి వన్డే సెంచరీ అందుకుంది. సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ 27 బంతుల్లోనే మరో 50 పరుగులు చేసింది. వన్ డౌన్లో క్రీజులోకి వచ్చిన రిచా సైతం రఫ్పాడించడం వల్ల టీమ్ఇండియా తొలిసారి 400 పరుగుల మార్క్ క్రాస్ చేసింది.