Rohit Virat Ranji Trophy 2025 : టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రదర్శన గత రెండు టెస్టు సిరీస్‌ల్లో ఆశించిన స్థాయిలో లేదు. స్వదేశంలో న్యూజిలాండ్, రీసెంట్గా ఆస్ట్రేలియా పర్యటలో భారత్ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉంది. దీంతో ప్లేయర్లంతా డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలోనే జనవరి 23నుంచి ప్రారంభం కానున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా యువ ఆటగాళ్లు సైతం రంజీ బరిలో దిగనున్నారు.
రోహిత్ రెడీ! కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబయి తరఫున బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రోహిత్ దేశవాళీలో దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. కాగా, 2015లో రోహిత్ ఆఖరిసారిగా రంజీలో ఆడాడు.
విరాట్ డౌటే! బ్యాటింగ్‌లో విరాట్‌ది కూడా అదే పరిస్థితి. ఇదివరకులా విరాట్ బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. అందుకే విరాట్‌ను కూడా రంజీ బరిలో దిగాల్సిందేనని మేనేజ్మెంట్ ఆదేశించినట్లు సమాచారం. మరి కోహ్లీ డొమెస్టిక్ ఆడతాడా? అనేది డౌట్‌గానే ఉంది. కానీ, దిల్లీ జట్టు మాత్రం ప్రాబబుల్స్‌లో విరాట్‌కు చోటు ఇచ్చింది. దీంతో కోహ్లీ కూడా దేశవాళీలో ఆడతాడని క్రీడా వర్గాల సమాచారం. చూడాలి మరి విరాట్ రంజీ బరిలో దిగుతాడా? లేదా!
పంత్ ఓకే : 2025 రంజీకి అందుబాటులో ఉంటానని యంగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పటికే దిల్లీ మేజేన్మెంట్కు సమాచారం అందించాడట. దీంతో పంత్ బరిలో దిగడం ఖాయంగానే కనిపిస్తుంది. 2016-17లో పంత్ చివరిసారిగా రంజీ క్రికెట్ ఆడాడు. ఆసీస్ టెస్టు సిరీస్‌లో విఫలమైన పంత, రంజీలో ఆడి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
గిల్ క్లియర్ : టీమ్ఇండియాలో పేలవ ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ కూడా ఒకడు. ఈ యంగ్ బ్యాటర్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అయితే వయసురీత్యా గిల్‌కు ఎంతో భవిష్యత్ ఉంది. ఈ క్రమంలో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి గిల్‌కు రంజీ మ్యాచ్‌లు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో గిల్ మళ్లీ రంజీ బాట పట్టాడు. అతడు పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు.
జైస్వాల్ సెన్సేషనల్ : టీమ్ఇండియాలో అరంగేట్రం చేసినప్పటి నుంచి యశస్వీ జైస్వాల్ సంచలనంగా మారాడు. టీ20, టెస్టు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ, జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ బీసీసీఐ నిబంధన మేరకు డొమెస్టిక్ ఆడనున్నాడు. ముంబయి తరఫున జైస్వాల్ బరిలో దిగనున్నాడు. వీరితోపాటు యంగ్ ప్లేయర్లు నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ తదితరులు కూడా రంజీలో కనిపించనున్నారు.
దేశవాళీ టోర్నీల్లో యంగ్ క్రికెటర్లు! - గంభీర్ సూచనతో రంజీ బరిలోకి!