తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొత్త ఫార్మాట్‌లో జరగనున్న రంజీ ట్రోఫీ - బీసీసీఐ చేసిన కీలక మార్పులు ఇవే! - RANJI TROPHY NEW FORMAT

రంజీ ట్రోఫీలో కీలక మార్పులు - కొత్త ఫార్మాట్ కోసం బీసీసీఐ నయా రూల్స్

Ranji Trophy
Ranji Trophy (IANS)

By ETV Bharat Sports Team

Published : Oct 10, 2024, 5:04 PM IST

కీలక డొమెస్టిక్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. 2024-25 సీజన్‌ అక్టోబర్‌ 11 నుంచి మొదలు కానుంది. ఈ సారి రంజీ ట్రోఫీలో బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. గత సీజన్లలో ఒకే దశలో టోర్నమెంట్‌ జరిగేది. అయితే ఈ సారి రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహిస్తారు.రంజీ ట్రోఫీ కొత్త ఫార్మాట్‌ ఎలా ఉంటుంది? మార్పులు ఎందుకు చేశారు? వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

రెండు దశల ఫార్మాట్
మొదటి దశ : అక్టోబర్ 11 నుంచి నవంబర్ 13 మధ్య ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. దీని తర్వాత విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (T20 ఫార్మాట్) జరుగుతాయి. ఇందుకు రంజీకి విరామం ఇస్తారు. లేకపోతే ఈ రెండు వైట్-బాల్ టోర్నీలు రంజీ ట్రోఫీ సీజన్‌తో క్లాష్‌ అవుతాయి.రెండో దశ: నాకౌట్ రౌండ్‌లతో కూడిన రంజీ ట్రోఫీ జనవరి 23న తిరిగి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు ఫైనల్ జరుగుతుంది.

ఆటగాళ్ల ఫిర్యాదులకు పరిష్కారం?
గతంలో ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్ గురించి ఫిర్యాదు చేశారు. మ్యాచ్‌ల మధ్య కేవలం మూడు రోజుల విశ్రాంతి మాత్రమే లభిస్తోందని పేర్కొన్నారు. రికవరీ సమయం తక్కువగా ఉండటంపై క్రికెటర్ శార్దూల్ ఠాకూర్, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో 2024-25 సీజన్‌కి బీసీసీఐ మ్యాచ్‌ల మధ్య విశ్రాంతి వ్యవధిని నాలుగు రోజులకు పెంచింది. దీంతో ఆటగాళ్లకు రికవరీ కావడానికి ఎక్కువ సమయం లభించింది.

రంజీ ట్రోఫీ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
రంజీ ట్రోఫీలో 38 జట్లు ఉన్నాయి. వీటిని ఐదు గ్రూపులుగా విభజించారు. ఎలైట్ A, B, C, D. ఈ నాలుగు గ్రూపుల్లో ఒక్కోదానిలో ఎనిమిది జట్లు ఉంటాయి. ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఓ టీమ్‌ తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్లతో ఆడుతుంది. ప్రతి గ్రూప్‌కి సొంత పాయింట్ల పట్టిక ఉంటుంది. ప్రతి ఎలైట్ గ్రూప్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌ స్టేజ్‌కి చేరుకొంటాయి. ఇందులోనే క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. ఈ స్టేజీలను దాటిన టీమ్‌లు తదుపరి దశకు వెళ్తాయి. ప్లేట్ గ్రూప్‌లో మొదటి రెండు జట్లు తదుపరి సీజన్‌లో ఎలైట్ గ్రూప్‌కి అర్హత సాధిస్తాయి. ఎలైట్ గ్రూపుల్లో చివర నిలిచిన రెండు జట్లను ప్లేట్ గ్రూప్‌లో చేరుస్తారు.

రంజీ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది? అసలా పేరు ఎలా వచ్చిందంటే? - Ranji Trophy History

సచిన్​ టు పుజారా- రంజీలో అత్యుత్తమ ప్లేయర్స్ వీరే!

ABOUT THE AUTHOR

...view details