ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా ఉందా? సింపుల్ టిప్స్‌తో ఈజీగా తగ్గించుకోండిలా! - HEALTH INSURANCE PREMIUMS REDUCE

ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం తగ్గాలా? ఈ టిప్స్ పాటించండి!

Health Insurance Premiums Reduce Tips
Health Insurance Premiums Reduce Tips (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2025, 5:17 PM IST

Health Insurance Premiums Reduce Tips : అకస్మాత్తుగా ఎంతోమంది వివిధ వ్యాధుల బారినపడుతున్నారు. వాటికి సంబంధించిన చికిత్సలు చేయించుకుంటే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమాను ఒక అదనపు ఆప్షన్‌లా చూడలేం. తప్పకుండా ఆ పాలసీని తీసుకునే దిశగా ఆలోచించాల్సి వస్తుంది.

జీవనశైలి వ్యాధుల ముప్పు
జీవనశైలి వ్యాధులపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) చేసిన ఒక అధ్యయనం ప్రకారం భారతీయుల్లో దాదాపు 35 శాతం అధిక రక్తపోటుతో, 10 శాతం మంది మధుమేహం (డయాబెటిస్)తో, 28 శాతం మంది అధిక కొలెస్టరాల్ స్థాయులతో బాధపడుతున్నారు. ఇక అకస్మాత్తుగా కరోనా తరహా వైరస్‌లు వ్యాపిస్తే ముసురుకునే వ్యాధులకు చికిత్స చేయించుకుంటే గంపెడు వైద్యబిల్లులను కట్టాల్సి వస్తుంది. అందుకే అత్యవసర వైద్యాల కోసం కొంత డబ్బును సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. రోబోటిక్ సర్జరీలు, జీన్ ఎడిటింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వైద్య రంగం మునుపెన్నడూ లేనంత వేగంతో దూసుకుపోతుండటం అనేది కీలకమైన సానుకూల అంశం. వైద్య బిల్లులు భారీగా ఉంటే ప్రతీ ఒక్కరూ భరించలేరు. అలాంటి వారిలో చాలామంది ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీల ప్రాధాన్యాన్ని గుర్తించారు. సరైన ఆరోగ్య బీమా పాలసీతో తమ కుటుంబానికి ఆరోగ్యరక్షణ కవచం లభిస్తుందని వారికి అర్థమైపోయింది. ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలను సాధ్యమైనంత మేర తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

త్వరగా తీసుకోండి- ఎక్కువ ఆదా చేయండి
ఆరోగ్య బీమా పాలసీని సాధ్యమైనంత చిన్న వయసులోనే తీసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల పాలసీ ప్రీమియం తగ్గిపోతుంది. చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే ప్రీమియంను తక్కువగా తీసుకుంటారు. వయసు, ఆరోగ్య స్థితిగతులను ఆధారంగా చేసుకొని ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంను నిర్ణయిస్తారు. 25 ఏళ్ల వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంతో పోల్చుకుంటే 40 ఏళ్ల వ్యక్తి చెల్లించే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే దీర్ఘకాలంలో తక్కువ ప్రీమియం చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ కూడా ముగిసిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ ఆరోగ్య సమస్యలు వచ్చినా, కవరేజీని క్లెయిమ్ చేసుకోగలుగుతారు.

నెట్ వర్క్ హాస్పిటల్స్, పడకల సౌలభ్యం
ఆరోగ్య బీమా పాలసీని అందించే సంస్థకు చెందిన నెట్‌వర్క్‌లో ఉండే ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే ప్రీమియం భారీగా తగ్గిపోతుంది. ఇది సగటున 15 శాతం మేర తగ్గుతుంది. ఫలితంగా ఆస్పత్రి ఖర్చులూ తగ్గుతాయి. పాలసీదారుడి జేబుకు చిల్లుపడదు. పొదుపులకు ఢోకా రాదు. మల్టీ బెడ్ షేరింగ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించే ఆరోగ్య బీమా పాలసీలు సైతం ఉన్నాయి. వాటిని ఎంచుకున్నా బీమా ప్రీమియంను తగ్గించుకోవచ్చు.

ఈఎంఐ పద్ధతిలో ప్రీమియం
ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన మొత్తం ప్రీమియంను ఏకకాలంలో చెల్లించలేరా ? అయితే మీరు ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. చాలా బీమా సంస్థలు దీన్ని అందిస్తున్నాయి. ఉదాహరణకు మీ ఆరోగ్య బీమా పాలసీ సంవత్సరానికి రూ.20వేలు అనుకుందాం. మీరు దీన్ని ఈఎంఐలలోకి మార్చుకొని, ప్రతినెలా రూ.1600 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. మీరు ఫ్యామిలీతో వీకెండ్‌లో డైనింగ్‌కు వెళితే అయ్యేంత ఖర్చుతో, ప్రతినెలా పాలసీ ప్రీమియంకు సంబంధించిన ఈఎంఐను ఇచ్చేయొచ్చు.

ప్రీమియంపై సిబిల్ స్కోర్ ప్రభావం
సిబిల్ స్కోరు ప్రభావం బీమా ప్రీమియంలపై ఉంటుందా ? అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఈ సందేహం సరైనదే. తప్పకుండా సిబిల్ స్కోరు ప్రభావం బీమా ప్రీమియంలపై ఉంటుంది. మంచి సిబిల్ స్కోరు ఉన్నవాళ్లకు పలు సంస్థలు బీమా ప్రీమియంపై రాయితీలు ఇస్తున్నాయి. తద్వారా ప్రీమియంను సగటున 15 శాతం దాకా తగ్గించుకోవచ్చు. ఈవిధమైన రాయితీ ఇచ్చే ఆరోగ్య బీమా సంస్థను మనం వెతుక్కోవాలి.

సూపర్ టాప్-అప్ ప్లాన్లతో ఫుల్​ కవరేజీ
ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేవారు తప్పకుండా టాప్ అప్ ప్లాన్లు, సూపర్ టాప్ అప్ ప్లాన్ల గురించి కూడా తెలుసుకోవాలి. వీటివల్ల అధిక మొత్తంలో పాలసీ కవరేజీని పొందొచ్చు. అయితే వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఒకవేళ అనుకోకుండా మీ వైద్యబిల్లులు నిర్ణీత స్థాయిని దాటినా, ఈ ప్లాన్ల ద్వారా కచ్చితంగా కవరేజీ లభిస్తుంది. ఉదాహరణకు మీకు ఇప్పటికే ఉన్న పాలసీతో రూ.10 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ ఉందని అనుకుందాం. ఇలాంటప్పుడు మీరు అదనంగా రూ.90 లక్షల విలువ కలిగిన సూపర్ టాప్ అప్ ప్లాన్ తీసుకుంటే, మీకు మొత్తం రూ.1 కోటి దాకా కవరేజీ లభిస్తుంది.

కో పేమెంట్ ఆప్షన్లు
ఆరోగ్య బీమా ప్రీమియంను తగ్గించుకునే మరో మార్గం కూడా ఉంది. అయితే అవసరమైనప్పుడే దీన్ని వాడాలి. మీరు వైద్యం చేసుకోవడానికి అయిన ఖర్చులను ఆరోగ్య బీమా కంపెనీతో కలిసి పంచుకోవడమే ‘కో పేమెంట్’. బీమా కంపెనీ నుంచి కవరేజీ లభించే వరకు మీరు మొత్తం వైద్య బిల్లులో కొంత భాగాన్ని సదరు వైద్యసంస్థకు చెల్లించాలి. దాన్ని బిల్లులను బీమా కంపెనీకి ఎప్పటికప్పుడు సమర్పించాలి.

డిజిటల్‌లోనే పాలసీల ఎంపిక
ఆరోగ్య బీమా పాలసీ కావాలంటే ఆన్‌లైన్‌లోనే తీసుకోండి. దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పుతుంది. అదనపు ఛార్జీలు పడవు. అటు కంపెనీకి, ఇటు మీకు సమయం ఆదా అవుతుంది. వెరసి, బీమా ప్రీమియం తగ్గిపోతుంది. వివిధ రకాల పాలసీలను మీరు పోల్చి చూసుకునే సౌలభ్యం ఆన్‌లైన్‌లో ఉంటుంది. వాటిలో మీ అవసరాలను తీర్చే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మధ్యవర్తులు తమకు ఎక్కువ ప్రయోజనం ఇచ్చే పాలసీలనే విక్రయించే ప్రయత్నం చేస్తుంటారు.

కట్టిన ప్రీమియం మొత్తం వాపస్- 'జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్​'తో ఎంత లాభమంటే?

లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ టాప్-​3 'యాడ్ ఆన్స్'తో మీ కుటుంబానికి పూర్తి భరోసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.