ETV Bharat / offbeat

తమిళ తంబీల​ "దిండిగల్​ మటన్​ బిర్యానీ" - ఓ రేంజ్​లో ఉంటుంది! - HOW TO MAKE DINDIGUL MUTTON BIRYANI

-సండే మటన్ వండాలని అనుకుంటున్నారా? -ఎప్పుడూ రొటీన్​గా కాకుండా ఈసారికి తమిళనాడు స్పెషల్​ చేసేయండి!

How to Make Dindigul Mutton Biryani
How to Make Dindigul Mutton Biryani (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 5:03 PM IST

How to Make Dindigul Mutton Biryani : సండే వచ్చిందంటే మెజార్టీ పీపుల్​ ఇంట్లో నాన్​వెజ్ ఘుమఘుమల వాసన రావాల్సిందే. నాన్​వెజ్​లో మటన్​కు సెపరేట్​ ఫ్యాన్​ బేస్​ ఉంటుంది. అందులోనూ మటన్​ బిర్యానీ అంటే లొట్టలేసుకుంటారు. అందుకే ఈ రెసిపీ కోసం హోటల్స్​,రెస్టారెంట్స్​కు వెళ్లి మరీ తింటుంటారు. అయితే, ఇకపై అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కేవలం నిమిషాల్లో మటన్​ బిర్యానీ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన మటన్​ బిర్యానీ బోర్​ కొడుతుంది. అందుకే ఈసారి వెరైటీగా తమిళనాడు స్పెషల్​ దిండిగల్​ మటన్​ బిర్యానీ ప్రిపేర్​ చేసుకోండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. మామూలు మటన్​ బిర్యానీ కన్నా సూపర్​గా ఉంటుంది. మరి లేట్​ చేయకుండా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • మటన్ - 1 కిలో
  • నీళ్లు - ఒకటిన్నర కప్పులు
  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • నెయ్యి - 2 టేబుల్​ స్పూన్లు
  • పసుపు - 1 / 2 టీస్పూన్
  • ఎండుకారం - 1 టేబుల్​ స్పూన్​
  • కల్లు ఉప్పు - రుచికి సరిపడా
  • నిమ్మకాయ - 1
  • పెరుగు - 200 గ్రాములు
  • పుదీనా ఆకులు - గుప్పెడు
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు
  • జీరగ సంబ బియ్యం - 2 కప్పులు
  • అరటి ఆకు - 1

మసాలా పొడికి కావలసిన పదార్థాలు

  • ధనియాలు - 2 టేబుల్​ స్పూన్లు
  • జీడిపప్పులు - 10
  • జీలకర్ర - 1 టేబుల్​ స్పూన్​
  • రాతి పువ్వు - 1 1 / 2 టేబుల్​ స్పూన్లు
  • యాలకులు - 6
  • మిరియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • బిర్యానీ ఆకులు - 2
  • అనాస పువ్వు - 2
  • దాల్చిన చెక్క - అర ఇంచ్​
  • జాపత్రి - 2
  • లవంగాలు - 10
  • జాజికాయ - కొద్దిగా
  • సోంపు గింజలు - 1 టేబుల్​ స్పూన్​

మసాలా పేస్ట్ కోసం:

  • చిన్న ఉల్లిపాయలు - 15
  • పచ్చిమిరపకాయలు - 5
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • అల్లం ముక్కలు - 2 టేబుల్​ స్పూన్లు

తయారీ విధానం:

  • మటన్​ ముక్కలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ప్రెషర్​ కుక్కర్​లో వేసి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద 4 విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసుకోవాలి.
  • మటన్​ ఉడికేలోపు మసాలా పొడి ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం మిక్సీజార్​లోకి ధనియాలు, జీడిపప్పులు, జీలకర్ర, రాతి పువ్వు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, జాజికాయ, సోంపు గింజలు వేసి మెత్తగా పొడి చేసుకుని ఓ బౌల్​లోకి తీసుకోవాలి.
  • మసాలా పేస్ట్​ కోసం మరో మిక్సీ జార్​లోకి చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి మెత్తటి పేస్టులాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ప్రెషర్​ కుక్కర్​ నాలుగు విజిల్స్​ వచ్చిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఆవిరి పోయేంతవరకు పక్కన ఉంచాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి మటన్​ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మటన్​ ఉడికించిన నీటిని పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి గిన్నె ​ పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందే గ్రైండ్​ చేసుకున్న మసాలా పేస్ట్​ వేసి పచ్చివాసన పోయి రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి.
  • మసాలా పేస్ట్​ ఫ్రై అయిన తర్వాత ముందే ప్రిపేర్​ చేసుకున్న మసాలా పొడి మూడు టేబుల్​ స్పూన్లు, పసుపు, కారం, ఉప్పు వేసి లో ఫ్లేమ్​లో వేసి మసాలాలు వేయించుకోవాలి.
  • మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన మటన్​ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోకి నిమ్మకాయ రసం, పెరుగు వేసి మరోసారి బాగా కలపాలి.
  • కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఆపై అందులోకి మటన్​ ఉడికించగా మిగిలిన నీటిని పోసుకుని కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో 25 నిమిషాలు ఉడికించాలి.
  • ఈలోపు ఓ గిన్నెలోకి జీరగ సంబా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
  • మటన్ చక్కగా ఉడికిన తరువాత నానబెట్టిన బియ్యాన్ని మటన్ మిశ్రమంలో వేసి, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి కలపాలి. ఆపై మూతపెట్టి మీడియం ఫ్లేములో పది నిమిషాల పాటు బియ్యాన్ని ఉడికించాలి.
  • 10 నిమిషాల తర్వాత బిర్యానీ గిన్నెను పక్కన పెట్టి, స్టవ్​ మీద మందపాటి, వెడల్పు కలగిన పెనం పెట్టుకోవాలి.పెనం వేడెక్కిన తర్వాత బిర్యానీ గిన్నెను పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఈ మటన్​ మిశ్రమాన్ని మరోసారి కలిపి దానిపైన కొద్దిగా నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి, బిర్యానీని అరిటాకుతో కవర్​ చేసుకోవాలి. ఆపై బిర్యానీ గిన్నెను ఫాయిల్ పేపర్తో మూసేసి, కదలకుండా ఓ ప్లేట్​ పెట్టాలి.
  • లో ఫ్లేమ్​లో 20 నిమిషాల పాటు బిర్యానీని దంలో ఉడికించాలి. అంతే, దిండిగల్ మటన్ బిర్యానీ రెడీ. దీన్ని వేడివేడిగా రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది.

చలికాలంలో అద్దిరిపోయే "మటన్ పాయ సూప్" - ఇలా చేసుకొని జుర్రితే రుచితో పాటు ఆరోగ్యం బోనస్!

మటన్​ త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి - ఎంత ముదిరినా చక్కగా ఉడికిపోద్ది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.