ETV Bharat / state

అర్ధరాత్రి ఇంట్లోకి దొంగతనానికి వచ్చారు - అమెరికాలో ఉంటున్న యజమాని షాక్ ఇచ్చాడు - MEDCHAL MALKAJGIRI THEFT CASE

మేడ్చల్-మల్కాజిగిరిలో దొంగతనం - ఇద్దరు దుండగులను పట్టుకున్న స్థానికులు - దొంగలను పట్టించిన అమెరికాలో ఉన్న ఇంటి యజమాని

Medchal-Malkajgiri Theft Case
Medchal-Malkajgiri Theft Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 5:07 PM IST

Medchal-Malkajgiri Theft Case : తన ఇంటి దగ్గర దొంగతనం చేస్తే అమెరికాలో ఉన్న ఆ ఇంటి యజమాని సీసీటీవీలో చూసి పక్కింట్లో ఉండే బంధువులను అలర్ట్‌ చేశాడు. దీంతో ఆ ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దొంగల్లో ఇద్దరిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా పరిధిలోని కాచవాని సింగారం ముత్వెల్లిగూడలో డ్రీమ్స్‌ హోమ్స్‌ కాలనీలో గుర్తు తెలియని నలుగురు దొంగలుపడ్డారు. అర్ధరాత్రి ఆ ఇంటి తాళం పగులకొట్టారు. ఈ దృశ్యాలు అన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అమెరికాలో ఉంటున్న ఆ ఇంటి యజమాని సీసీటీవీలో చూసి పక్కనే ఉన్న వారి బంధువులను అలర్ట్‌ చేశారు. వెంటనే అతడు స్థానిక కాలనీ వాసులతో కలిసి చోరీ జరుగుతున్న ఇంటివైపు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు.

వారిని కాలనీ వాసుల సహాయంతో వెంబడించి ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయారు. దొరికిన ఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసి స్థానికులు మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టుబడిన నిందితులకు సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలను చూపిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దొంగ మామూలోడు కాదు! - ఏకంగా పోలీస్ ఇంటికే కన్నం

అర్థరాత్రి వచ్చాడు, విన్యాసాలు చేశాడు, వెళ్లిపోయాడు - ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.