Paris Olympics 2024 Neeraj Chopra : ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ దక్కింది. గురువారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో నీరజ్ చోప్రా కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ తుది పోరులో పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ 92 మీటర్లతో స్వర్ణం సాధించగా, నీరజ్ 89.45 మీటర్లతో సిల్వర్ను సొంతం చేసుకున్నాడు.
దీంతో నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు తన ప్రదర్శనపై నీరజ్ చోప్రా స్పందించాడు. తన ఆటను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
"దేశానికి మెడల్ అందించినందుకు ఆనందంగానే ఉంది. కానీ నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగు పర్చుకోవాలి. కచ్చితంగా దీనిపై సమీక్షించుకుంటాను. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. జావెలిన్ త్రో గట్టి పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ కూడా తనదైన రోజున అదరగొడతాడు. ప్రస్తుతం ఇది అర్షద్ డే. అయినా నేను కూడా వంద శాతం కష్టపడ్డాను. కానీ మరికొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. మన జాతీయ గీతం వినిపించ లేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది. కచ్చితంగా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాను." అని నీరజ్ అన్నాడు.